- Advertisement -
క్రీడాకారులకు క్రికెట్ కిట్లు అందజేత
తాడేపల్లిగూడెం
క్రీడలు ద్వారా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద పసుమర్తి చందు సహకారంతో పలువురు క్రీడాకారులకు క్రికెట్ కిట్లు అందజేశారు. ఎంతోమంది క్రీడల ద్వారా ఉన్నత స్థితికి చేరారు అన్నారు. చదువుతోపాటు క్రీడలు జీవితానికి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం, ఉప సర్పంచ్ అత్తింటి సోమశేఖర రావు, ఎంపీటీసీలు కరుటూరి గోవిందరాజు, పసుమర్తి సత్యనారాయణ, వార్డు సభ్యులు, యువకులు, పెద్దలు పాల్గొన్నారు.
- Advertisement -



