Sunday, April 13, 2025

ఏపీ రాజకీయాలకు…  క్రికెట్ లింక్..

- Advertisement -

గుంటూరు, నవంబర్ 22, (వాయిస్ టుడే):  వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఏపీ రాజకీయాలకు ఒక హెచ్చరిక లాంటిది. తమకు తిరుగు లేదనుకుంటున్న వైసీపీ, అధికారంలోకి వస్తాననుకుంటున్న టిడిపి, తాను లేని ప్రభుత్వం ఊహించలేమంటున్న జనసేన చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆది నుంచి ఒక్క ఓటమి కూడా చవిచూడని భారత్ ఫైనల్స్ లో ఎలా చతికిల పడిందో స్పష్టంగా చూశాం. ఎందుకు ఓడిందో కూడా కళ్ళకు కట్టినట్లు కనిపించింది. సెమీఫైనల్ వరకు పటిష్టంగా కనిపించిన భారత్.. ఫైనల్ లో పట్టు చేజార్చుకుంది. చుట్టూ స్టేడియంలో లక్షన్నరమంది భారతీయ ప్రేక్షకులు ఉండగా.. మొక్కవోని ధైర్యంతో ఆడిన ఆస్ట్రేలియా జట్టు విజేతగా నిలిచింది.అయితే ఈ మ్యాచ్లో టీమిండియా కు ట్రాక్ రికార్డు అక్కరకు రాలేదు. ఆఫ్ఘనిస్తాన్ తో కూడా అతి కష్టం మీద గెలిచిన ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ని కూడా ఆపసోపాలు పడుతూ ఓడించిన ఆస్ట్రేలియా.. అన్ని మ్యాచులు గెలుచుకొని వచ్చిన భారత్ ను ఓడించి ప్రపంచ విజేతగా నిలవడం మనం గుర్తించాలి. ఏపీలో వైసిపి గత నాలుగు సంవత్సరాలుగా అప్రతిహసంగా విజయాలు నమోదు చేసుకొని వస్తోంది. మరో మూడు నెలల్లో ఫైనల్ మ్యాచ్లో తలపడనుంది. నాలుగేళ్లుగా అన్ని ఎన్నికల్లో గెలిచాం కదా.. సాధారణ ఎన్నికల్లో సైతం గెలుపొందుతామంటే కుదరని పనిక్రికెట్ మాదిరిగానే.. ఈ మూడు నెలల్లో ఆటను బట్టి విజేతగా నిలిచే అవకాశాలుంటాయి. జనాన్ని తమ వైపు తిప్పుకునే పార్టీయే అంతిమంగా సాధిస్తుంది. అందరూ అనుకుంటున్నట్టు సానుభూతులు, అవినీతి ఆరోపణలు పనిచేయవు. వాటికి భిన్నంగా ఆలోచించి జనాన్ని తమ వైపు తిప్పుకోగలగాలి. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడని జనసేన ను హేళన చేయొచ్చు. ఇప్పుడు అదే జనసేన పైకి లేచి శివతాండవం ఆడేలా ఓటరు తీర్పు ఇవ్వవచ్చు. టిడిపి, జనసేన కూటమికి పట్టం కట్టొచ్చు. ఇప్పుడు వైసీపీయే ఆటలు ఎలా ఆడుతుందో చూడాలి. తాబేలు కుందేలు కథని గుర్తు చేసుకోకపోతే ఆ పార్టీకి నష్టం. దీక్ష, పట్టుదల వదలక పోవడం వల్ల తాబేలు గెలిచింది. ఆదమరిచి ధీమాగా ఉండడం వల్ల కుందేలు ఓడిపోయింది. ఇలా ఎలా చూసుకున్నా ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్.. ఏపీ రాజకీయాలను అంతర్లీనంగా హెచ్చరికలు పంపింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్