శారదా పీఠాధిపతిపై క్రిమినల్ కేసు పెట్టాలి
శారదా పీఠంలో అక్రమ నిర్మాణాలపై నోటీసులు ఇచ్చి వారం రోజులు
మూడు వారాలపాటు గడువు కావాలని కోరిన శారదా పీఠం
—– బి.వి.రామ్ కు తెలిపిన తహసీల్దార్ ఆనంద్ కుమార్
– తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బి.వి.రామ్
– చట్టం నుంచి తప్పించుకునేందుకే స్వరూపానంద ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
—- తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
Criminal case should be filed against the head of Sarada Peetha ---- Telugu Shakti President B.V. Ram
పెందుర్తి :
శారదా పీఠం అధిపతిగా చెప్పుకుంటున్న
స్వరూపానంద సరస్వతి పై క్రిమినల్ కేసు పెట్టాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెందుర్తి తహసిల్దార్ ఆనంద్ కుమార్ ను శనివారం మధ్యాహ్నం కలుసుకున్నారు. ఈ సందర్భంగా బి.వి.రామ్ మాట్లాడుతూ.. శారదా పీఠంలో కొంత భూమి ఆక్రమణలో ఉన్న కారణంగా సంజాయిషీ ఇవ్వాలని తహసిల్దార్ ఒక వారం క్రితమే నోటీసు జారీ చేశారన్నారు. అయినప్పటికీ పీఠం మేనేజర్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొనగా.. తహసిల్దార్ ఆనంద్ కుమార్ స్పందించారు. తమకు మూడు వారాల గడువు కావాలని శారదా పీఠం నుంచి విజ్ఞప్తి వచ్చిందన్నారు. అనంతరం బి.వి.రామ్ తీవ్రంగా స్పందించారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు శారదా పీఠాధిపతి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ అతడి పై క్రిమినల్ కేసు పెట్టాల్సిందేనని పట్టుపట్టారు. గతంలో వైసిపి అరాచక పరిపాలనలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే అప్పటికప్పుడే కూల్చివేతలు కొనసాగేవని ప్రస్తావించారు. అయితే రాష్ట్రంలో కొనసాగుతున్నది కూటమి ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం కాబట్టి వారం ముందుగానే నోటీసులు ఇచ్చింది అన్నారు.
శారదా పీఠంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబరు 90లో మొత్తం 72 సెంట్ల స్థలం ఉండగా అందులో 22 సెంట్లు ఆక్రమణకు గురైందని మీరే ప్రకటించారని పెందుర్తి తాసిల్దార్ ఆనంద్ కుమార్ ను ఉద్దేశించి బి.వి.రామ్ పేర్కొన్నారు. మరో వైపు శారదా పీఠంలో విలువైన ఆస్తులు, డాక్యుమెంట్లు తరలిపోకుండా ఉండేందుకు పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్ ప్రభుత్వం శారదాపీఠం మధ్య జరిగిన అక్రమ కార్యక్రమాలకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని బి.వి.రామ్ కూటమి ప్రభుత్వానికి గతంలోనే విజ్ఞప్తి చేశారు.