Wednesday, April 16, 2025

తన ఉనికి కాపాడుకోవడానికే మంత్రి పై విమర్శలు

- Advertisement -

తన ఉనికి కాపాడుకోవడానికే మంత్రి పై విమర్శలు

Criticism of the minister to save his existence

-గత ప్రభుత్వంలో ప్రజలకు మీరు ఏం చేసారో గుర్తు తెచ్చుకోవాలి

-మంథని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేది మంత్రి శ్రీధర్ బాబే

-ప్రెస్ మీట్ లో మంథని కాంగ్రెస్ నాయకులు

మంథని

ఉనికి కాపాడుకోవడానికే మంత్రి శ్రీధర్ బాబు మీద మాజీ జెడ్పి చైర్మన్ పుట్ట మధు
విమర్శలు చేస్తున్నాడని, స్థాయిని మించి విమర్శలు చేస్తే ఇక్కడ ఊరుకోడానికి ఎవరూ లేరనే విషయం గుర్తేరుగాలని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.
బుధవారం మంథని పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు ఆయిలీ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం లు మాట్లాడుతూ సోమవారం పుట్ట మధు మంత్రి శ్రీధర్ బాబు పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. నువ్వు మంత్రి శ్రీధర్ బాబు మీద మాట్లాడే ముందు గత ప్రభుత్వంలో ప్రజలకు మీరు ఏం చేసాం అనేది గుర్తు తెచ్చుకోవాలని అన్నారు.
ప్రతిసారి దళితులు, దళిత సోదరులు అని మాట్లాడటం తప్ప, దళితులకు నువ్వు చేసింది ఏమీ లేదని అన్నారు. దళిత బంధు అని తీసుకువచ్చి మన మంథని నియోజక వర్గంలో ఎన్ని కుటుంబాలకు దళిత బంధు ఇప్పించావో చూపించాలని అన్నారు.
ఆయిలీ ప్రసాద్ మాట్లాడుతూ మున్నూరు కాపు బీసీ బిడ్డ అయినా నన్ను  మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించి నాకు వెన్నంటే ఉంటూ రాజకీయ ఓణమాలు నేర్పిస్తూ నన్ను అత్యున్నత స్థానంలో తీసుకువెళ్లడానికి మా నాయకుడు ఎంతో కృషి చేశారనే విషయం గుర్తు ఎరగలని అన్నారు. అదే నీ దగ్గరా ఉన్న బీసీ నాయకులు మా అభివృద్ధి చూసి మంత్రి శ్రీధర్ బాబు  అడుగుజాడల్లో నడవడానికి కాంగ్రెస్ పార్టీలో చేరికలు అయ్యారని అన్నారు.ఇసుక లారీ డి కొనడం వల్ల అడవి సోమనపల్లి గ్రామానికి చెందిన సేగ్గం శైలజ అనే మహిళ మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా మంత్రి శ్రీధర్ బాబు  అధికారులను ఆదేశించారనీ అన్నారు. కస్తూరిబా బాలికల కళాశాలలో అనారోగ్యంతో అస్వస్థతకు గురైన విద్యార్థునిలకు  కలెక్టర్ తో,డాక్టర్లతో అధికారులతో మాట్లాడి వైద్యం అందించాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది తెలిసిన  వెంటనే మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ కి వెళ్లి విద్యార్థులను పరామర్శించడం జరిగిందని  నాయకులు అన్నారు.గతంలో  మున్సిపాలిటీ డంపియాడ్ అనేది మాత శిశు హస్పటల్ ముంద ఉంటే గర్భిణీలు, చిన్నపిల్లలు అనారోగ్యంతో బాధపడేవారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే జనావాసాలకు దూరంగా తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.ఆనాడు వైఎస్ హయాంలో మంత్రి శ్రీధర్ బాబు అదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిచెట్ ప్రాజెక్టును చేపటరని అన్నారు. కమిషన్ల కోసం కాలేశ్వరం ప్రాజెక్టును తీసుకువచ్చి ఇసుక లారీల మరణాలకు కారణమయ్యారని వారు ఎద్దేవా చేశారు.  శవ రాజకీయాలు చేసే నువ్వు మా నాయకుడు శ్రీధర్ బాబు గురించి మాట్లాడం సిగ్గుచేటు అని అన్నారు.బీసీ వాదం ఎత్తుకున్న నువ్వు  బీసీలకు మీ గత ప్రభుత్వంలో  ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు.  బీసీలను అనగా తీయాలనేది నీ ఆలోచన, మహనీయుల విగ్రహాలు చాటున రాజకీయం చేసే నువ్వు వాళ్లను గౌరవిస్తాలేరు అనడం సిగ్గుచేటు అని అన్నారు. మంథని నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని మంత్రి శ్రీధర్ బాబు  300 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకువచ్చారని,రానున్న రోజులలో మంథని నియోజకవర్గాన్ని రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తున్నారని నాయకులు అన్నారు.
ఈ కార్యక్రమంలో  పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలు శివ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల బానయ్య, ముస్కుల సురేందర్ రెడ్డి, బూడిద శంకర్, అజీమ్ ఖాన్, కుడుదుల వెంకన్న, ఐలి శ్రీనివాస్, దోరగోర్ల శ్రీనివాస్, పాపారావు, ఆర్ల నారాయణ, కాసిపేట బాపు, రొడ్డ రాజేశ్వర్, ఆక్కపాక సది, గొల్లపల్లి శ్రీనివాస్, రాకేష్, కౌన్సిలర్ నక్క నాగేంద్ర తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్