- Advertisement -
రైతు రుణమాఫీ చేయండి: కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి
ధరణి రద్దు చేయాలి: బిజెపి నేత గంట రవి కుమార్
వరంగల్ ( వాయిస్ టుడే ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలనీ, ప్రధాన మంత్రి ఫాసల్ భీమా యోజనను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తు ఈరోజు కిసాన్ మోర్చ వరంగల్ జిల్లా అధ్వర్యంలో బిజెపి నాయకులు డిమాండ్ చేశారు శనివారం బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో నాయుడు పంపు జంక్షన్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అంటూనే రైతు రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు గుది బండలా మారిన ధరణిని వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.
- Advertisement -



