- Advertisement -
జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై రేపు కీలక తీర్పు
జనసేనకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై రేపు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది.
దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది.
ఇప్పటికే విచారణ చేసిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
తమకే ఆ సింబల్ దక్కుతుందని జనసేన ధీమాగా ఉంది.
- Advertisement -