- Advertisement -
కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారు
Current charges have been increased and the burden has been put on the people
నెల్లూరు
పెరిగిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మినీ బైపాస్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక నియోజకవర్గం స్థాయిలో చేసిన నిరసన కార్యక్రమం జన ప్రవాహాన్ని తలపించింది.. ఈ జన ప్రవాహాన్ని చూస్తూనే అర్థమవుతుంది ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అనేది. బడికి వెళ్లే పిల్లలకు అందరికీ 15 వేల రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేశారు. ఆడబిడ్డలకు ఇస్తా అన్న పథకాలు, సూపర్ సిక్స్ ల పేరుతో అందిస్తానన్న సంక్షేమ పథకాలు హామీలు ఏవీ నెర వేర్చలేదు. 16 వేల కోట్ల రూపాయలు కరేంట్ చార్జీలు పెంచి ప్రజల పై భారం మోపారు. ఆంధ్ర ప్రదేశ్ లో 1.60 వేల కోట్ల కుటుంబాలు పేదరికం లో వుంటే వారి పై విద్యుత్ భారం మోపుతున్నారు. ఎన్నికలు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెర వేర్చలేదు అని అన్నారు
- Advertisement -