- Advertisement -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్న 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాంక్ నుంచి వస్తున్న ఓ భారతీయుడి వద్ద తనిఖీలు చేయగా ఈ బంగారాన్ని గుర్తించారు. ఫ్రూటీ జ్యూస్ ప్యాకెట్లలో అమర్చి తీసుకువస్తున్న 4.204 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, అతడిని అరెస్టు చేశారు. దీని విలువ రూ.2.24 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
- Advertisement -