Sunday, September 8, 2024

ఇక గులాబీ కరెంట్ కట్…

- Advertisement -

కరీంనగర్, నవంబర్ 23, (వాయిస్ టుడే): డిసెంబర్ 3న బీఆర్ఎస్ కరెంట్ కట్ అవుతుందని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని ఆయన విమర్శించారు. కరీంనగర్‌ రోడ్‌షోలో పాల్గొన్న బండి సంజయ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. తాను ఓటు రూ. 20 వేలు ఇస్తానని మంత్రి గంగుల కమలాకర్ దుష్ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తాను అక్రమాస్తులు సంపాదించానని మంత్రి గంగుల తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అక్రమాస్తులను నిరూపిస్తే ప్రజలకే ఇచ్చేస్తానన్నారు బండి సంజయ్.భారీ వర్షాలతో కరీంనగర్ చుట్టుప్రక్కల గ్రామాల్లో పంట నష్టపోయిన రైతులకు ఇంతవరకు రూ. 10 వేలు ఇవ్వలేదు గానీ.. పంజాబ్ రాష్ట్రానికి పది లక్షల సాయం చేశారని బీఆర్ఎస్ సర్కార్‌పై బండి సంజయ్ ధ్వజమెత్తారు. ధాన్యం తరుగులో మంత్రి‌ గంగుల కమలాకర్ పాత్ర లేదని.. ఆయన దేవుడి‌ గుడిలో ప్రమాణం చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. పండించిన ప్రతి‌ ధాన్యం గింజను కేంద్ర ‌ప్రభుత్వమే కొంటుంది. పేపర్ లీకేజ్ వల్ల తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు. వారికి మద్దతుగా తాను ధర్నా చేస్తే.. మంత్రి గంగుల కమలాకర్, సీఎం కేసీఆర్ జైలుకు పంపారని బండి సంజయ్ తెలిపారు. తన మీద కక్ష్య కట్టి 74 కేసులు పెట్టారని ఎద్దేవా చేశారు. గంగుల కమలాకర్ డబ్బులను నమ్ముకుని‌ కరీంనగర్‌లో పోటి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కరీంనగర్ పార్లమెంట్‌ ‌పరిధిలో రూ. 7 వేల కోట్ల నిధులను అభివృద్ధి కోసం తీసుకొచ్చినట్టు ప్రజలకు గుర్తు చేశారు బండి సంజయ్.

ప్రభుత్వం బీజేపీదే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన ప్రచారంలో జోష్ పెంచింది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ప్రచారకులుగా నియమించింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి పియుష్ గోయల్ మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కుటుంబ పాలనకు సమయం ముగిసింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఒడించబోతున్నారన్నారు. కేసీఆర్ విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డాడిని ఆరోపించారు. ప్రాజెక్ట్‌లను నాణ్యత లేకుండా నిర్మించారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ యేతర ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించారన్నారు. మోడీ హయాంలో విదేశీ మారకం విలువ రికార్డ్ స్థాయిలో పెరిగిందని కీర్తించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై ఓవైసీ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలీదని’ ఎద్దేవా చేశారు.తెలంగాణ సమాజం ఆయన మాటలు నమ్మే పరిస్తితిలో లేదన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రైలు ప్రయాణ సమయం తగ్గడంతో పాటూ ప్రమాదాలు కూడా తగ్గాయన్నారు. రైల్వేలను మరింత విస్తరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ ఇన్స్‌స్టిట్యూట్‌లతోపాటూ వైద్య కళాశాలలను ఇచ్చామన్నారు. పసుపు రైతులను ఆదుకునేదుకు ప్రత్యేకమైన బోర్డును ఏర్పాటు చేయాలని ప్రధాని సంకల్పించినట్లు తెలిపారు. మరిన్ని అభివృద్ది పనులను చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి అధికారం ఇస్తే మరింత అభివృద్దితో పాటూ సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్