మంత్రి నారా లోకేష్ ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకొని రూ.54.34 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
Cyber criminals loot Rs. 54.34 lakhs by using Minister Nara Lokesh's photo as WhatsApp DP
Xలో హెల్ప్ ఎట్ నారా లోకేష్, హెల్ప్ ఎట్ NCBN, హెల్ప్ ఎట్ పవన్ కళ్యాణ్ వంటి హాష్ ట్యాగ్‌లు పెట్టి వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం చేస్తామని ట్రాప్
నారా లోకేష్ ఫోటో వాట్సాప్ డీపీగా పెట్టుకొని తాను టీడీపీ NRI కన్వీనర్ అంటూ పరిచయం చేసుకున్న కొండూరి రాజేష్ అనే వ్యక్తి
వైద్య పరీక్షల కోసం ఆర్థిక సాయం అడిగిన వారికి నకిలీ బ్యాంక్ క్రెడిట్ రసీదులు పంపి సాయం చేస్తున్నట్లు నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు
కొన్ని రోజుల తర్వాత సాయంగా అందించిన డబ్బులు జమ కావాలంటే 4% రేమిటెన్స్ చార్జెస్ కట్టాలంటూ డబ్బులు వసూలు
ఇలా రూ.54.34 లక్షలు వసూలు చేసిన ముగ్గురు సైబర్ నేరగాళ్లు
A1 కొండూరి రాజేష్, A2 గుత్తికొండ సాయి శ్రీనాథ్, A3 చిత్తడి తల సుమంత్‌లను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు


