Sunday, September 8, 2024

స్మార్ట్ గా మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు

- Advertisement -

హైదరాబాద్, నవంబర్ 25 : భర్త చనిపోవడంతో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బును చేజేతులారా నేరస్థుల చేతుల్లో పెట్టేసింది ఓ మహిళ. సైబర్ నేరగాళ్లు వేసిన వలలో చిక్కుకున్న బాధితురాలు తన అకౌంట్ లోని 1 కోటి 59 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లకు పంపించింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఆగస్టులో సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం.. రాచకొండ పరిధిలో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తుంది బాధితురాలు. ఇటీవల తన భర్త అకాలమరణంతో మృతి చెందాడు. తన భర్త పేరుమీద ఉన్న 1 కోటి 59 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు బాధితురాలు ఖాతాలో జమ అయ్యింది.ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు బాధితురాలు ఫోన్ నెంబర్‌కు కాల్ చేశారు. కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నామని మాట్లాడారు. మీకు వచ్చిన పార్శిల్‌లో నార్కోటిక్ పదార్థాలు ఉన్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని మభ్య పెట్టారు. ఇంతలోనే ముంబై పోలీస్ పేరుతో మరొక కాల్ రావడంతో నిజమేకావొచ్చని ఆమె భావించింది. దీంతో సైబర్ నిందితుల ట్రాప్‌లో చిక్కుకుంది. మత్తు పదార్థాల పార్శిల్‌ పై బాధితురాలపై అరెస్టు వారెంట్ జారీ అయిందని మరో ఫేక్ కాల్ సృష్టించారు కేటుగాళ్లు. తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని మరో కొత్త బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో జమ చేసుకోవాల్సిందిగా ముంబై పోలీసులు బాధితురాలికి సూచించినట్టుగా ప్లాన్ చేశారు. దీంతో ఆమె కొత్త అకౌంట్ లోకి ఆర్టిజిఎస్ ద్వారా డబ్బు మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేయగానే కేటుగాళ్లు మొత్తాన్ని లూటీ చేశారు.తాను మోసపోయిన విషయాన్ని గ్రహించిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఈ ఏడాది ఆగస్టులో ఆశ్రయించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి అందులో ఏ బ్యాంక్ నుంచి లావాదేవీలు జరిగాయో గుర్తించారు. గుజరాత్ కి చెందిన ఇద్దరు యువకుల బ్యాంక్ అకౌంట్ కి ఈ డబ్బులు వెళ్లినట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఇద్దరు యువకులు కమిషన్ కు ఆశపడి సైబర్ నేరస్థుడికి సహాయపడినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి యువకులను గుజరాత్లో అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు.. బాధితుల బ్యాంకు ఖాతాలో ఉన్న 20 లక్షల రూపాయలను కోర్టు ఆదేశాలతో బాధితురాలకు పోలీసులు అప్పచెప్పారు..ఇటీవల కాలంలో నగరంలో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. గత మార్చి నెలలో ఐఊటీ ప్రొఫెసర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ పేరుతో 4 కోట్ల రూపాయలు స్వాహ చేశారు. ఫిబ్రవరిలో ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీ పేరుతో 1.60 కోట్లు స్వాహా చేశారు. కొద్దిరోజుల క్రితం ఓటీపీ ఫ్రాడ్ పేరుతో ఒక ఆర్మీ అధికారి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. సెప్టెంబర్‌లో ఫేక్ ఇన్సూరెన్స్ పేరుతో రూ. 45 లక్షలు కొట్టేశారు. నేరాలు పెరుగుతోన్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరికీ బ్యాంక్‌ వివరాలు తెలపొద్దని చెబుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్