దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్..
ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్.. ఉత్తమ నటి: నయనతార
ముంబై ఫిబ్రవరి 21
ఇండియన్ సినీ చరిత్రలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్‌ఎఫ్)- 2024’ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి ముంబైలో ఘనంగా జరిగింది. భారత సినీ ప్రముఖులతో పాటు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఇక ఈ అవార్డుల్లో గత ఏడాది విడుదలైన ‘జవాన్’, ‘యానిమల్’ చిత్రాలు పోటీ పడ్డాయి. జవాన్‌లో షారుఖ్ నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన నయనతార ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఇక గతేడాది యానిమల్ సినిమాతో కలెక్షన్ల వర్షం కురిపించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు.
2024 విజేతలు వీరే..
ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటి: నయనతార (జవాన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే)
ఉత్తమ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (జవాన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు – వరుణ్ జైన్
ఉత్తమ నేపథ్య గాయని – శిల్పా రావు
విలన్ పాత్రలో ఉత్తమ నటుడు: బాబీ డియోల్ (యానిమల్)
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి: రూపాలీ గంగూలీ (అనుపమ)
టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటుడు: నీల్ భట్ (ఘుమ్ హై కిసికే ప్యార్ మేయిన్)
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: ఘుమ్ హై కిసికే ప్యార్ మేయిన్
ఉత్తమ వెబ్ సిరీస్ : ఫర్జీ
వెబ్ సిరీస్‌లో ఉత్తమ నటి: కరిష్మా తన్నా (స్కూప్)
చలనచిత్ర పరిశ్రమకు అత్యుత్తమ సహకారం: మౌషుమి ఛటర్జీ
సంగీత పరిశ్రమకు అత్యుత్తమ సహకారం: KJ యేసుదాస్
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్.
- Advertisement -
- Advertisement -