కంటోన్మెంట్ అక్టోబర్ 28(వాయిస్ టుడే ప్రతినిధి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిజెపి ఆశావాహ నేత మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె డాక్టర్ సుష్మిత శంకర్రావు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఏడో వార్డులోని పలు కాలనీలు బస్తీలలో ప్రచారం చేస్తూ బిజెపి పార్టీకి ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం దళిత నియోజకవర్గం కంటోన్మెంట్ కు ఒక వార్డ్ కు 285 ఇండ్లు కేటాయించడంలో ఆంతర్యం ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ నియోజకవర్గంలో 9 వార్డులు ఉండగా వార్డుకు 1000 చొప్పున ఇవ్వవలసిన డబుల్ బెడ్ రూములు నియోజకవర్గం మొత్తం కేవలం 1000 పైచిలుకు డబుల్ బెడ్ రూమ్స్ మాత్రమే నియోజకవర్గ వ్యాప్తంగా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలను మోసం చేస్తుందని సుస్మిత మండిపడ్డారు దళిత నియోజకవర్గం లో దళిత బంధువు కేటాయించడంలో వారి వైఫల్యము ప్రజల్లో కనపడుతుందని ఓటుతోనే ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయని ఆమె ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా నాయకురాలు బిజెపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



