Sunday, September 8, 2024

దళితులు కాంగ్రెస్ కు ఓటేయద్దు

- Advertisement -

ఖమ్మం, నవంబర్ 21, (వాయిస్ టుడే): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేది కాదు సచ్చేది కాదని, అనవసరంగా భట్టి విక్రమార్కకు  ఓటు వేయొద్దని సీఎం కేసీఆర్  వ్యాఖ్యానించారు. చింతకాని మండలం తనవల్లే బాగుపడిందని, అలాంటప్పుడు పట్టింపు లేని భట్టి విక్రమార్కకు ఓటు ఎందుకు వేయాలని అడిగారు. ఆ పార్టీకి 20 కంటే సీట్లు ఎక్కువ రావని అన్నారు. ఖమ్మం  జిల్లా మధిర నియోజకవర్గంలో  సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. దళిత వర్గం ఒక్కరు కూడా భట్టి విక్రమార్కకు ఓటు వేయొద్దని కోరారు.బీఆర్ఎస్ అభ్యర్థి కమల్‌ రాజును గెలిపిస్తే మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. గతం కంటే మనకి ఇంకో రెండు సీట్లు ఎక్కువే వస్తాయని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మధిరలో కరెంటు ఉండేదా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. రైతుబంధు ఇవ్వొద్దని, కరెంటు ఇవ్వొద్దని కాంగ్రెస్‌ అంటోందని విమర్శించారు. ధరణి స్థానంలో భూమాత పెడతారట అని.. వాళ్లు పెట్టేది భూమాత కాదు.. భూమేత అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. పదేళ్ల నుంచి కొనసాగుతున్న అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుందని అన్నారు.” భట్టి విక్రమార్క నియోజకవర్గానికి ఆర్నెల్లకోనాడు వస్తాడు. చుట్టపుచూపుగా వచ్చే మనిషి. ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. కాంగ్రెస్ లో డజను మంది ముఖ్యమంత్రులు ఉన్నరు. వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు. గ్యారంటీ చెప్తున్న కాంగ్రెస్ కు అవే 20 సీట్లు. ఇంక తక్కువనే వస్తయి. నా ఎన్నికల పర్యటనలో భాగంగా మధిర 70వ నియోజకవర్గం. ఇంకా 30 నియోజకవర్గా్లలో పర్యటించాలి. వాటికి కూడా వెళ్తే కాంగ్రెస్ ఆ ఇంత కూడా ఊడుసుకుపోతది. బీఆర్ఎస్సే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తది. దళిత వర్గం ఒక్కరు కూడా భట్టి విక్రమార్కకు ఓటు వేయొద్దనికోరారు.

పదేళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేశాం

ఆషామాషీగా పని చేయలేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం పని చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో ఎన్నికల ప్రచారలో భాగంగా.. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే అభాండాలు, అబద్ధాలు, హామీలు ఇవ్వడం దేశంలో ఎన్నికల సమయంలో జరుగుతున్నవే అన్నారు. రాయి ఏది రత్నం ఏదో తెలుసుకోవాలని సూచించారు. రిజల్ట్స్ వచ్చిన రోజున దుకాణం క్లోజ్ అవ్వదు.. అదే రోజు ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థి గెలుపును బట్టే ప్రభుత్వం వుంటుందన్నారు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటు అని తెలిపారు. ప్రజల తల రాతను రాష్ట్ర ప్రజల భవితవ్యం నిర్ణయిస్తుందని అన్నారు. ప్రజల కోసమే బీఆర్ఎస్ పుట్టిందన్నారు. తెలంగాణ ఇవ్వడంలో అనేక సార్లు డోకా చేశారని తెలిపారు. మన మీద ప్రేమతో తెలంగాణ ఇవ్వలేదు.. తప్పని సరి పరిస్థితిలో ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ చరిత్ర మోసాల చరిత్ర అని మండిపడ్డారు. 50 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించిందని స్పష్టం చేశారు.పదేళ్ల లో ఎక్కడ పంటలు ఎండలేదని అన్నారు. ఆషామాషీగా పనిచేయలేదు.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రభుత్వం పని చేసిందని అన్నారు. సీతారాం కంప్లీట్ అయితే నాలుగు కోట్ల ధాన్యం పండుతుందని అన్నారు. విద్యుత్ వినియోగంలో దేశంలో టాప్ లో ఉన్నామని గుర్తు చేశారు. చిత్తశుద్ది కమిట్మెంట్ తో పని చేశామని అన్నారు. రెండు సార్లు ఓడించారు.. అయిన మీ మీద అలుగా లేదన్నారు. మధిర నాది… ఏ ఇంచు అయిన కేసీఆర్ దే అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు విరోధి.. అయిన అభివృద్ధి మధిరలో చేశామన్నారు. భట్టి కాంగ్రెస్ అయినప్పటికీ పక్షపాతంగా వ్యవహరించలేదని తెలిపారు. చింతకాని మండలం దళిత బందు ప్రతి కుటుంభానికి ఇచ్చానని అన్నారు. దళిత బందు చేయమని బట్టి నన్ను అడుగులేదన్నారు. తెలంగాణ దళిత బందు దేశానికి మార్గ దర్శకత్వం అని అన్నారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని ప్రశ్నించారు. నియోజకవర్గానికి చుట్టం చూపుతో వస్తారని మండిపడ్డారు. 20 మంది సీఎంలు కాంగ్రెస్ లో వున్నారని వ్యంగాస్త్రం వేశారు. గతంలో కంటే రెండు సీట్లు బీఆర్ఎస్ పెరుగుతుందన్నారు. భట్టి వల్ల మీకు వచ్చేది ఏమి లేదని అన్నారు. భట్టికి ఒక్క ఓటు కూడా పడొద్దు.. భట్టి గెలిచేది లేదు సీఎం అయ్యేది లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవ్వరికీ ఒరిగేది లేదని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కరెంట్ లేదని అన్నారు. భట్టి విక్రమార్క మార్పు చేయాలి కదా? బోనకల్లో దళితులు దళిత బందు పెట్టమని అడిగారు అందువల్లనే ప్రకటించానని అన్నారు. మిగిలిన నియోజకవర్గం మొత్తం దళిత బందు ఇస్తానని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్