26.1 C
New York
Wednesday, June 19, 2024

డార్లింగ్’.. హనుమాన్ అంతటి పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను:డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

- Advertisement -

డార్లింగ్’.. హనుమాన్ అంతటి పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను: టైటిల్&గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
‘డార్లింగ్’తో ఖచ్చితంగా ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తాం: హీరో ప్రియదర్శి
ప్రియదర్శి, నభా నటేష్, అశ్విన్ రామ్, కె నిరంజన్ రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ మూవీ టైటిల్ ‘డార్లింగ్’- హిలేరియస్ టైటిల్ గ్లింప్స్ విడుదల

పాన్ ఇండియా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు . బలగం, ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్స్ సిరీస్‌ల విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్.  రొమ్-కామ్‌ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి ‘డార్లింగ్’ అనే టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘వై దిస్ కొలవెరి’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ పెట్టారు. నభా నటేష్‌తో ప్రియదర్శి పెళ్లి ప్రపోజల్‌ని చూపించే ఫస్ట్‌లుక్ పోస్టర్ టైటిల్‌లాగే ఆహ్లాదకరంగా ఉంది. టైటిల్ అనౌన్స్మెంట్  గ్లింప్స్ ప్రియదర్శి , నభా నటేష్ మధ్య రిలేషన్ ని చూపుతుంది. ఇది పూర్తిగా హిలేరియస్ గా ఉంది.
సెలూన్‌లో ప్రియదర్శి, బార్బర్ మధ్య ఫన్నీ సంభాషణతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఎందుకు దిగులుగా వున్నావ్ అని బార్బర్  అడిగినప్పుడు..దర్శి జీవితంలోని వివిధ దశలలో ఆడవారి మనస్తత్వాలను చెబుతాడు. ఆడపిల్లలు తల్లులుగా ఉన్నప్పుడు ప్రేమగా, ఆప్యాయంగా వుంటారు. చెల్లాయిగా ఉన్నప్పుడు సపోర్టివ్ గా  వుంటారు. అదే అమ్మాయి ప్రేమికురాలిగా ఉన్నప్పుడు, క్యూట్‌గా, బబ్లీగా ఉండి మనల్ని చాలా అర్థం చేసుకుంటుంది. కానీ ఆ పిల్లే పెళ్ళాం అయితే మన జీవితాన్ని తలకిందులు చేసి తాట తీస్తుందని ప్రియదర్శి చెప్పడం, వెంటనే నభా నటేష్ చూపులతో, మాటలతో దర్శికి చుక్కలు చూపించడం హిలేరియస్ గా వుంది.
టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్  డార్లింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ అవుతుందని హామీ ఇచ్చింది. మహేష్ బాబు పెదవే పలికిన పాత తన కొడుకుపై తల్లి ప్రేమను చూపించడానికి, పవన్ కళ్యాణ్ అన్నయ్య అన్నవంటే పాట అన్నదమ్ముల బంధాన్ని ప్రదర్శించడానికి,  ప్రభాస్ మెల్లగా కరగని పాట ప్రేమికుల మధ్య సాన్నిహిత్యాన్ని చూపించడానికి ఉపయోగించిన తీరు బావుంది. ఈ మొత్తం కాన్సెప్ట్ ఒక యూనిక్ ఆలోచన, వారి మధ్య జరిగే ఫైట్ కథనానికి కొత్త, కామిక్ దృక్పథాన్ని తెస్తుంది.
జనాదరణ పొందిన పాటల ద్వారా అమ్మాయిల మానసిక స్థితిని వర్ణించే టైటిల్ గ్లింప్స్ ఆలోచన దర్శకుడు అశ్విన్ రామ్ క్రియేటివిటీని  చూపుతుంది. హనుమాన్ నిర్మాతల నుంచి వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులఈ చిత్రానికి పని చేస్తున్నారు. నరేష్ డీవోపీ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. హేమంత్ డైలాగ్స్ రాయగా, లవ్ టుడే ప్రదీప్ ఈ రాఘవ్  చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.
టైటిల్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. దర్శితో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది. దర్శకుడిగా నా తొలి షాట్ దర్శి మీదే పెట్టాను. దర్శిని నా మొదటి హీరో. ఈ వేడుకు అతిధిగా రావడం ఆనందంగా వుంది. నిరంజన్ గారితో మూడేళ్ళుగా జర్నీ చేస్తున్నాం. చాలా పాషన్ వున్న నిర్మాత. మంచి కథ ఎక్కడున్నా వింటారు. హనుమాన్ లాంటి పెద్ద సినిమాని తీసే అవకాశం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. హనుమాన్ విడుదలకు సిద్ధమౌతున్న సమయంలో దర్శితో సినిమాని టేకప్ చేశారు. ఇంత మంచి కథని వదులుకోలేనని చెప్పారు. దర్శకుడు అశ్విన్ కి చాలా పాషన్, ఎనర్జీ వుంది. నభా లాంటి మంచి నటి ఈ ప్రాజెక్ట్ లో వుండటం అన్నీ సరిగ్గా సమకూరినట్లయింది. వివేక్ సాగర్ నాకు ఇష్టమైన కంపోజర్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. హను మాన్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది డార్లింగ్ కూడా అంతటి పెద్ద విజయాన్ని సాధించి నిరంజన్ గారికి మంచి, డబ్బు రావాలని, ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ..  ఈ వేడుకకు విచ్చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ప్రశాంత్ వర్మ. హర్ష, సునీల్ గారి ధన్యవాదాలు. నమ్ము నమ్మి ఈ కథని నాతొ చేస్తామని చెప్పి దానిపైనే నిలబడిన అశ్విన్ కి ధన్యవాదాలు. నిర్మాత నిరంజన్ గారు మాపై ఉంచిన నమ్మకం హనుమాన్ అంత బలాన్ని ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ తొందరలోనే వుంటుంది, వివేక్ సాగర్ అద్భుతంగా మ్యూజిక్ చేశాడు. ప్రభాస్ అన్నకి,  ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. ప్రభాస్ గారిని ప్రేమతో పిలుచుకునే టైటిల్ ఈ సినిమాకి పెట్టడం మాకు చాలా గర్వకారణం. నభా తో నటించడం చాలా ఆనందంగా అనిపించింది. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్.  ఈ సినిమాతో ఖచ్చితంగా ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తాం. ఇది డార్లింగ్ ప్రామిస్’ అన్నారు.
హీరోయిన్ నభా నటేష్ మాట్లాడుతూ.. యాక్సిడెంట్ వలన కొంత కాలం సినిమాలు చేయలేదు. మళ్ళీ చేయడానికి ఒక ఎక్సయిటింగ్ కథ కోసం ఎదురుచూస్తున్నపుడు అశ్విన్ ఈ కథ చెప్పారు. చాలా అద్భుతంగా అనిపించింది. పాత్రలు చాలా కొత్తగా వుంటాయి. ఇలాంటి భిన్నమైన కథని నమ్మి నిర్మించిన నిర్మాతలు ధన్యవాదాలు. వివేక్ సాగర్ బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది బెస్ట్ టీం వర్క్. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. దర్శి అద్భుతమైన నటుడు. చాలా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది” అన్నారు.
నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..    ఈ వేడుకకు విచ్చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ప్రశాంత్ వర్మ. హర్ష, సునీల్ గారి ధన్యవాదాలు. మా టీం అందరికీ థాంక్స్. దర్శకుడు అశ్విన్ నమ్మినది అద్భుతంగా తెరపై తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందని నమ్ముతున్నాం’ అన్నారు.
చిత్ర దర్శకుడు అశ్విన్ రామ్ మాట్లాడుతూ..  ప్రియదర్శి గారికి ఈ కథ చెప్పగానే తప్పకుండా చేద్దామని మాటిచ్చారు. మా కలలని నమ్మే వ్యక్తి కోసం ఎదురుచూశాం. నిర్మాత నిరంజన్ గారు మా కలల్ని సాకారం చేశారు. కథ చెప్పగానే నమ్మారు. శరవేగంగా సినిమాని చేశాం. ఆయన కంటెంట్ ని బలంగా నమ్మారు. చైతన్య గారికి కూడా ఈ కథ చాలా నచ్చింది. చెప్పినపుడు చాలా ఎంజాయ్ చేశారు. ప్రియదర్శి, నభా, టీం అందరితో పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. టీం అందరికీ ధన్యవాదాలు’ తెలిపారు.
దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. డార్లింగ్ గ్లింప్స్ చాలా ఆహ్లాదకరంగా వుంది. ఈ మధ్య  హాస్యంతో వస్తున్న సినిమాలు బాగా నడుస్తున్నాయి. నిజానికి హాస్యంతో కూడిన సినిమాలు చేయడం చాలా కష్టం. తెలుగు వాళ్ళు హాస్యంను అద్భుతంగా చేయగలరు. ఇప్పుడు మళ్ళీ హాస్యంతో కూడుకున్న సినిమాల ట్రెండ్ మళ్ళీ మొదలైయిందని అనుకుంటున్నాను. దర్శితో చేయబోతున్న సినిమా కూడా హాస్య ప్రధానమైనదే. దర్శకుడు అశ్విన్ కి టీం అందరికీ ఆల్ ది బెస్ట్. టీజర్ చాలా ప్రామెసింగ్ గా వుంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. ఇది అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను’ అన్నారు
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ..ఈ టీజర్ లో నన్ను నేను చూసుకున్నాను. టీజర్అందరినీ హత్తుకునేలా వుంది.  భార్య భర్త అనుబంధంతో తీసే సినిమాలు ఎవర్ గ్రీన్. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధిస్తుంది. ఈ సినిమా వందకోట్లు చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
దర్శకుడు హర్ష .. డార్లింగ్ గ్లింప్స్ చాలా ఆసక్తికరంగా వుంది. కలర్ ఫుల్ గా వుంది. అందరికీ రిలేట్ అయ్యే పాయింట్ మీద తీశారు. ఇది అందరికీ రిలేట్ అయి పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. దర్శి వెర్సటైల్ యాక్టర్. ఇందులో కూడా తన వైవిధ్యం చూపించారని అనుకుంటున్నాను, టీజర్ అదిరిపోయింది. సినిమా కోసం ఎదురుచూస్తున్నాను’ అన్నారు.
శ్రీమతి చైతన్య మాట్లాడుతూ.. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ను సపోర్ట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు. డార్లింగ్ సినిమా అందరికీ అలరించేలా అద్భుతంగా వుంటుంది’ అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
నటీనటులు: ప్రియదర్శి, నభా నటేష్

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!