వరంగల్ నగర ఇంఛార్జి పోలీస్ కమిషనర్ గా దాసరి మురళీధర్…!
వరంగల్ క్రైం బ్యూరో, అక్టోబర్ 12 (వాయిస్ టుడే ప్రతినిధి)
ఈ సంవత్సరం నవంబరులో జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం రాష్ట్రంలోని పలువురు ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఇందులో భాగంగానే
వరంగల్ సిపి గా పనిచేస్తున్న రంగనాథ్ బదిలీ కావడంతో క్రైం డీసీపీ మురళీధర్ కు ఇన్ఛార్జి సీపీగా బాధ్యతలను అప్పగిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. వరంగల్ సీపీగా ఎవరు వస్తారనే ఆసక్తి నెలకొంది. రాష్ట్ర సీఎస్ ఎన్నికల కమిషన్ కు మూడు పేర్లను ప్రతిపాదించి పంపించాలి. అందులో కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక మేరకు డీఐజీ ర్యాంక్ అధికారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఎవరు వస్తారు…? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.