- Advertisement -
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన దాసోజు శ్రవణ్ కుమార్
హైదరాబాద్
Dasoju Shravan Kumar takes oath as MLC
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత డా. దాసోజు శ్రవణ్ కుమార్ బుధవారం ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, మల్లారెడ్డి మరియు తదితర బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు
- Advertisement -