మూడు పథకాలకు డేట్ ఫిక్స్….

- Advertisement -

మూడు పథకాలకు డేట్ ఫిక్స్….

Date fixed for three schemes...

నెల్లూరు, ఫిబ్రవరి 7, (వాయిస్ టుడే)
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదినెలలు అవుతుంది. దీంతో త్వరలో మూడు పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది. వరసగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సిద్ధమయింది. ముఖ్యమైన పథకాలను గ్రౌండ్ చేయబోతున్నట్లు మంత్రి వర్గసమావేశంలో ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఖజానా ఖాళీ కావడంతో వెంటనే కొన్నిపథకాలను అమలు చేయలేకపోయామని చంద్రబాబు వివరించారు.ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా పింఛను మొత్తాన్ని అధికారంలోకి వచ్చిన తొలి నెల నుంచే నాలుగు వేలరూపాయలను అందించడం ప్రారంభించామని చంద్రబాబు తెలిపారు.మరో ముఖ్యమైన మూడు పథకాలను గ్రౌండ్ చేయడానికి రెడీ అవుతున్నామని కూడా చంద్రబాబు తెలిపారు. తల్లికి వందనం నిధులను వచ్చే జూన్ నెల నుంచి ప్రారంభించనున్నారు. విద్యాసంవత్సరం వేసవి సెలవుల అనంతరం ఒక్కొక్కరికీ పదిహేను వేలరూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నప్పటికీ అందరికీ ఈ పథకం అమలుచేస్తామని మాట ఇవ్వడంతో అందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఎంపిక చేయాలని, అనర్హులు ఎవరూ ఇందులో ఉండకుండా విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు కోరారు. ప్రజాధనం వృధా కాకూడదన్న అభిప్రాయంతోనే అనర్హులను పథకాల నుంచి తొలగించాలని ఆయన తెలిపారు.ఇక మరో ముఖ్యమైనది రైతులకు అన్నదాత సుఖీభవ కూడా పథకాన్ని కూడా మే నెల నుంచి అమలు చేయనున్నారు. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా రైతుల ఖాతాల్లో ఇరవై వేల రూపాయల నగదును జమ చేయాలని భావిస్తున్నారు. పెట్టుబడి సాయం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే ఈ సాయంతో రైతులు విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేస్తారని, అందుకే వారికి అవసరమైన సమయంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి విధివిధానాలను కూడా ఖరారుచేయాలని సంబంధిత శాఖ అధికారులను ,మంత్రిని ఆదేశించారు. ఇక మూడో పథకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉగాది నుంచి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఉచిత బస్సు పథకం పకడ్బందీగా అమలుచేయాలని, ఎవరికీ నష్టం కలగకుండా దానిని అమలు చేసేలా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక ఏప్రిల్ నెలలో మత్స్యకార భరోసాను ఇవ్వాలనికూడా చంద్రబాబు నిర్ణయించారు.
జగన్ ఫైర్..
బాబు ష్యూరిటీ.. భవిష్యత్ కు గ్యారంటీ అని ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకూ అమలు చేయలేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బటన్ నొక్కడం పెద్ద పనా? ముసలావిడ కూడా నొక్కుతుందని చెప్పిన చంద్రబాబు దానిని నొక్కలేకపోతున్నారన్నారు. బాబు ష్యూరిటీ.. మోసానికి గ్యారంటీ అన్న రీతిలో తయారైందన్నారు. రొటీన్ గా కథలు చెప్పడమే తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. హామీలకు గ్యారంటీ అంటూ ఇంటింటికీ బాండ్లను కూడా పంపించారని ఎద్దేవా చేశారు. అమలు చేయలేకపోతే చొక్కాలు పట్టుకుని నిలదీయమన్న కూటమి నేతలను ఇప్పుడు ఏం చేయాలని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి? అని జగన్ నిలదీశారు.80,820 కోట్ల రూపాయలు ఈ తొమ్మిది నెలల్లోనే ఈ ప్రభుత్వం చేసిందన్నారు. అమరావతి పేరుతో మరో యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధంగా ఉందని జగన్ అన్నారు. చేసిన అప్పులు, చేయబోయిన అప్పులు, మార్క్ ఫెడ్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్నీ కలిపితే లక్షా నలభై వేలకోట్ల రూపాయలు చేసిందన్నారు. సూపర్ సిక్స్ లేదని, తాము గతంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేదని జగన్ అన్నారు. అమ్మవొడి పాయె.. వసతి దీవెన పాయె… ఫీజు రీఎంబర్స్ మెంట్ పాయె.. అంటూ జగన్ ఎద్దేవా చేశారు. వాహనమిత్ర, నేతన్నల నేస్తం, కాపు నేస్తం, లా నేస్తం వంటి గత పథకాలన్నీ ఆపేశారని జగన్ మండిపడ్డారు. మరి 1,40 లక్షల కోట్ల అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని జగన్ ప్రశ్నించారు.వాలంటీర్లను ఎలా మోసం చేశారో.. ప్రభుత్వ ఉద్యోగులను కూడా అలాగే మోసం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. పదిహేడు మెడికల్ కళాశాలలను ప్రయివేటుకు అప్పగించాలని ఈ ప్రభుత్వం సిద్ధమయిందన్నారు. పేదలకు ఉచిత వైద్యం కూడా అందించే వాటిని ప్రయివేటు పరంచేస్తుందని జగన్ అన్నారు. తమ హయాంలో పోర్టులను నిర్మించామని చెప్పారు. తొమ్మిదినెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు రికార్డులు బద్దలు కొట్టాయని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులను కూడా మోసం చేశారన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతం ఎప్పుడు ఇచ్చారో చెప్పాలంటూ జగన్ అన్నారు. సంపద సృష్టించడమంటే తన వారి ఆస్తులను పెంచుకోవడమే నని జగన్ మండి పడ్డారు. రూపాయి ఆదాయం లేకపోగా, ఇసుక ధర డబల్ అయిందన్నారు. చంద్రబాబు నాయుడు జేబులో సంపద సృష్టి జరుగుతుందన్నారు. ఆదాయం ఆవిరి అయిందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular