- Advertisement -
కూమార్తె ఆత్మహత్య-వియ్యంకుడి హత్య
Daughter's suicide-Viyyankudi murder
నిజామాబాద్, సెప్టెంబర్ 26, (వాయిస్ టుడే)
తెలంగాణలోదారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి తన కుమార్తె ఆత్మహత్యకు అత్తింటి వారే కారణమని భావించాడు. వారి ఇంటిపై దాడికి పాల్పడి వియ్యంకుడిని నరికేశాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలం కంజర గ్రామంలో గోవర్థన్ అనే యువకుడు భవిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల ఆమె ఆత్మహత్యకు పాల్పడగా.. భవిత మృతికి గోవర్థనే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో మృతురాలి తండ్రి సత్యనారాయణ అత్తింటి వారిపై దాడి చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో గోవర్థన్ ఇంట్లో లేకపోవడంతో అతని తండ్రి నరహరిని కత్తులతో నరికి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
- Advertisement -



