Saturday, February 8, 2025

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘డియర్ కృష్ణ’ ట్రైలర్ లాంచ్

- Advertisement -

రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా ‘డియర్ కృష్ణ’ ట్రైలర్ లాంచ్

'Dear Krishna' trailer launch by hero Srikanth

పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’ చిత్రం ట్రైలర్ ను తాజాగా రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ కు సర్వత్ర మంచి స్పందన వస్తుంది. పీఎన్ బలరామ్ రచయిత, నిర్మాతగా, దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్దం అయింది. అక్షయ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ‘ప్రేమలు’ చిత్రంతో తెలుగు వారి హృదయాన్ని కొల్లగొట్టిన బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తుండగా మరో బ్యూటీ ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుందన్నారు. ట్రైలర్ లో ప్రతి షాట్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రేమలు హీరోయిన్ మమతా బైజు హీరోయిన్ గా నటించడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి అన్నారు. ఈ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధించాలని దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.
సినీ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుందని, వినూత్నమైన కథతో, వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్ చేయడం నచ్చింది అని అన్నారు. రియల్ ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తలకెక్కించడం మెచ్చుకోదగ్గ విషయం అన్నారు. ఈ చిత్రం మలయాళం తెలుగులో ఒకేసారి విడుదల చేస్తున్నారని ఇలాంటి చిత్రాలు మరెన్నో చేయాలని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు
విశ్వ హిందూ పరిశత్ వాళ్లు కూడా ట్రైలర్ చూసీ మేకర్స్ ను కొనియాడరు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని, కచ్చితంగా డియర్ కృష్ణ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని చెప్పారు. కథాకథనాలలో మాత్రమే కాకుండా, ప్రచార కార్యక్రమాల్లోనూ కొత్తదనాన్ని చూపిస్తోంది టీమ్. తాజాగా మరోక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. సినిమా టికెట్ బుకింగ్ చేస్తే అక్షరాల పదివేలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది.
మొదటి 100 టికెట్ల బుకింగ్ లో ఒక టికెట్ ను ఎంపిక చేసి ఆ టికెట్ దారుడికి రూ. 10000 క్యాష్ బ్యాక్ కింద బహుమతిగా అందించనున్నట్ల చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ ప్రక్రియను వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు చెప్పారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాణంతర పనులు పూర్తి చేసుకున్న డియర్ కృష్ణ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా టికెట్లను బుక్ చేసుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
చిత్రం: డియర్ కృష్ణ
నటీనటులు: అక్షయ్, మమిత బైజు, ఐశ్వర్య

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్