- Advertisement -
సైదులు మృతి తీరని లోటు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్, మండలం చెట్ల ముకుందాపురం గ్రామానికి చెందిన అభ్యుదయ వాది,అయిత గాని సైదులు సంతాప సభ ఆదివారం జరిగింది. సైదులు అకాల మృతి పార్టీకి ,కుటుంబానికి తీరనిలోటని, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొనుగోటి నరేందర్, మాజీ ఉపసర్పంచ్ గడ్డం శేఖర్, అన్నారు. సైదులు తాను నమ్మిన సిద్ధాంతం కోసం ,కడవరకు పోరాడిన వ్యక్తి అని, ఎంతోమందికి ఆర్థిక సహాయ సహకారాలు అందించిన వ్యక్తి సైదులు మరణం బాధాకరమని వారన్నారు. సైదులు చిత్రపటానికి పూల దండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సతీష్, సంజీవ్, నగేష్, గోపాలకృష్ణ, మిర్యాల సతీష్ తదితరులు నివాళులర్పించారు. సైదులు ఆశయాలు సాధించాలని పిలుపునిచ్చారు. సైదులు కుటుంబాన్ని ఆడుకుంటామని హామీ ఇచ్చారు.
- Advertisement -



