Wednesday, April 23, 2025

కేసీఆర్‌ స్ఫూర్తితో 29న దీక్షా దివస్‌.!!

- Advertisement -

కేసీఆర్‌ స్ఫూర్తితో 29న దీక్షా దివస్‌.!!

Deeksha Divas on 29th inspired by KCR.!!

హైదరాబాద్

జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు చేపడుతం
కేసీఆర్‌ సచ్చుడో తెలంగాణ వచ్చుడో.. అని 2009 నవంబర్‌ 29న దీక్ష చేశారు
రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజది.
కేసీఆర్‌ వెంట నిలబడిన 3.5 కోట్ల మంది
ఇప్పుడూ అవే పరిస్థితులు, నిర్బంధాలు
మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం
26న జిల్లాల్లో సన్నాహక సమావేశాలు
33 జిల్లాలకు ఇన్‌చార్జుల నియామకం
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
హైదరాబాద్‌, నవంబర్‌ 25  ఉద్యమ నేత, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్ఫూర్తితో ఈ నెల 29న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 33 జిల్లా కేంద్రాల్లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాల్లో దీక్షా దివస్‌ చేపడుతామని చెప్పారు. హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఆదివారం మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావుగౌడ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేశ్‌, కేపీ వివేకానంద, పార్టీ నేత చల్మెడ లక్ష్మీనరసింహారావుతో కలిసి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కేసీఆర్‌ చెరగని ముద్రవేశారని, మళ్లీ ఆనాటి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ, నాడు తెలంగాణ సమాజా న్ని ఐక్యం చేసిన సందర్భాన్ని స్మరించుకుం టూ, ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతామని తెలిపారు. ఈ దుర్మార్గ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీకి బు ద్ధి చెప్పేందుకు కదం తొకుతామని చెప్పారు. 29న కార్యక్రమ విజయవంతానికి పార్టీ శ్రేణు లు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమాల నిర్వహణకు 33 జిల్లాలకు సీనియర్‌ నాయకులను ఇన్‌చార్జులుగా నియమించినట్టు వెల్లడించారు. ఈ నెల 26న అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు, 27, 28 తేదీల్లో ఏర్పాట్లకు కసరత్తు చేపట్టనున్నట్టు తెలిపారు. కేసీఆర్‌ తన దీక్షను ముగించిన డిసెంబర్‌ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిషరిస్తామని చెప్పారు. ఆ రోజున పార్టీ నాయకులంతా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తూ తెలంగాణ తల్లికి ప్రణమిల్లాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ దీక్షతో ఉద్యమానికి నిమ్స్‌ ద వాఖాన కేంద్ర బిందువుగా మారిందని గుర్తుచేశారు. అందుకే డిసెంబర్‌ 9న నిమ్స్‌ దవాఖానలో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. ఆనాటి కార్యక్రమా లు, ఉద్యమ జ్ఞాపకాలను మళ్లీ గుర్తు తెచ్చేలా మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్‌ సచ్చుడో, తెలంగాణ తెచ్చుడో’ నినాదంతో దీక్ష:
అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్‌ గులాబీ జెండాను ఎగురవేశారని కేటీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్‌ అని ప్రశంసించారు. 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ నాడు చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజ అని గుర్తు చేశారు. స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు గా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే శుభదినమని తెలిపారు. ఆనాడు కేసీఆర్‌ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో అని తెగువ చూపిన నాయకుడికి 3కోట్ల మంది తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో అండగా నిలబడ్డారని, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశ రాజకీయ వ్య వస్థను ఒప్పించి, మెప్పించి, కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ కలిపిన సందర్భం దీక్షా దివస్‌ అని కేటీఆర్‌ గుర్తుచేశారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్