Wednesday, December 4, 2024

దీపం పధకం ప్రారంభం…టీ కాచిన చంద్రబాబు

- Advertisement -

దీపం పధకం ప్రారంభం…టీ కాచిన చంద్రబాబు

Deepam scheme started... Chandrababu made tea

శ్రీకాకుళం, నవంబర్ 1, (వాయిస్ టుడే)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో పర్యటించిన సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి గ్యాస్ సిలిండర్‌ పంపిణీ చేశారు. అనంతరం స్వయంగా గ్యాస్ వెలిగించి టీ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల సంఖ్య, ఎంత మందికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆరా తీశారు. తర్వాత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ తో కలిసి టీ తాగారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు అదే వీధిలో మరో ఒంటరి మహిళకు పెన్షన్ పంపిణీ చేశారు.అంతకు ముందు.. శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ దగ్గర బస్సులో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తొలి ఏడాది ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి 2684 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో తొలి విడత కోసం 894కోట్ల రూపాయల చెక్‌ను పెట్రోలియం సంస్థలకు అందజేశారు. సాయంత్రం అధికారులతో ముఖాముఖిలో సమీక్ష నిర్వహిస్తారు సీఎం.ఈ రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేయనున్నారు చంద్రబాబు.. శనివారం విజయనగరం జిల్లాలో రోడ్ల మరమ్మతు పనులకు శ్రీకారం చుడతారు. గజపతినగరం మండలం పురిటిపెంట దగ్గర రోడ్డుపై గుంతలను పూడ్చే పనుల్లో స్వయంగా పాల్గొంటారు సీఎం. భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల పురోగతిని పరిశీలించి.. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్