Thursday, December 12, 2024

కోమటిరెడ్డికి ఓటమి తప్పదు: కేటీఆర్‌

- Advertisement -

నల్గోండ, నవంబర్ 14: కర్ణాటక నుంచి వచ్చిన డబ్బు సంచులతో ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో సబ్బండ వర్గాలకు ధీమా అని మంత్రి చెప్పారు.బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ పేర్లు మార్చి కాపీకొట్టి మేనిఫెస్టోలో పెట్టిందని విమర్శించారు. పోటీ చేయని జానారెడ్డి కూడా సీఎం అవుతా అంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఓటమి తప్పదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డబ్బు మదంతో కాంగ్రెస్ సీనియర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాణ్యతలేని కరెంటు, కాలిపోయే మోటర్లు, ఎరువుల కొరత, విత్తనాల కొరత తప్పదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలే మాకు ధైర్యమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ సీఎం ఎవరు ఉండాలి అనేది ఢిల్లీ పెద్దలు నిర్ణయించే దుస్థితి రావద్దన్నారు.

Defeat is inevitable for Komati Reddy
Defeat is inevitable for Komati Reddy

లింగయ్యను గెలిపించండి

బక్క పల్చని వ్యక్తి కేసీఆర్‌ను ఓడించేందుకు ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నుంచి దిగుతున్నారనీ కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణలో లీడర్లు లేరా అని ప్రశ్నించారు. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తదనీ ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండ జిల్లా చిట్యాల లో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్డు షో లో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.జనంలో లేని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ నేతలు సంక్రాంతి గంగిరెద్దుల మాదిరిగా వస్తున్నారనీ విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ముఖ్యమంత్రి ఎవరో తెలియదనీ, సీల్డ్ కవర్ సీఎం తెలంగాణకు అవసరం లేదని ధ్వజమెత్తారు. తాజా మాజీ మంత్రి కేటీఆర్. రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ అసలే అక్కర లేదనీ చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు.. అంటే అరు నెలకు ఒక సీఎం గ్యారంటీ అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు కర్నాటక నుంచి డబ్బులు వస్తున్నాయన్నారు కేటీఆర్‌. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఈసారి గర్వభంగం తప్పదన్నారు. డబ్బు మదంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ మాట్లాడుతున్నారని, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య గెలవడం ఖాయమన్నారు.అటు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంత్రి కేటీఆర్ చురకలు అంటించారు. డబ్బు సంచులతో మిడిసి పడుతున్నారనీ, డబ్బు మద్యం ఉన్న కోమటిరెడ్డి బ్రద‌ర్స్ కు ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో మూడు గంటల కరెంటు చాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటుండని అన్నారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా ఆలోచించుకుని ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు టీవీ వేదికల్లో కొట్టుకుంటున్నారని, మూడో సారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమై పోయిందన్నారు. మరోసారి కేసీఆర్ గెలిస్తే పేద ప్రజలకు మంచి జరుగుతుందని కేటీఆర్ చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్