Monday, March 24, 2025

ఇకపై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీనే

- Advertisement -

ఐఏఎస్ లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా?

రాష్ట్ర కేబినెట్ మంత్రుల్లో, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది

కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోంది 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది

ఇకపై ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీనే

ఏనాడైనా టీచర్లు, నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడిందా?

 

Defeat the Congress intellectualsMake BJP win
Defeat the Congress intellectuals
Make BJP win

బీఆర్ఎస్ పనైపోయింది అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది

కాంగ్రెస్ తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది

క్రైస్తవుల్లో చాలా మంది ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకుంటూ ఎస్సీలను మోసం చేస్తున్నారు

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే కుల సంఘాల పనా?

కాంగ్రెస్ ను ఓడించండి బీజేపిని గెలిపించండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్

కరీంనగర్, జనవరి 17 (వాయిస్ టుడే): రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే ఐఏఎస్ లు మూడు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే అవినీతి, తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లయిందన్నారు. రాష్ట్రంలో మంత్రుల మధ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందన్నారు. కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికి 15 శాతం చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ.56 వేల నిరుద్యోగ భ్రుతి, ప్రతి మహిళకు స్కూటీ, తులం బంగారం, ప్రతి ఉద్యోగికి పీఆర్సీ, 4 డీఏలు, రైతులకు రైతు భరోసా, బోనస్, రుణమాఫీ బాకీ పడిందని అన్నారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని ఎద్దేవా చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాకీల కాంగ్రెస్ సర్కార్ ను బండకేసి బాదాలని ప్రజలకు పిలుపునిచ్చారు.టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ లోని కొండా సత్య లక్ష్మీ గార్డెన్ లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్,ఉమ్మడి మెదక్ జిల్లాల్లోని బీజేపీ మండలాధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ కొత్త మండలాధ్యక్షులుగా నియమితులైన తరువాత తొలిసారిగా ఎదురవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ దమ్ము చూపించండి. పీపుల్స్ పల్స్ సహా అనేక సర్వే సంస్థలు ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరకక బయటనుండి అద్దెకు అభ్యర్థులను తెచ్చుకున్నాయి.బీఆర్ఎస్ అసలు పోటీలోనే లేదు. ఈసారి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవడం తథ్యం. ఎన్నికల ఫలితాల తరువాత నుండి మళ్లీ అధికారంలోకి వచ్చేదాకా రాష్ట్రంలో బీజేపీయే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఒక్క బీజేపీకే ఉంది. నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల పక్షాన నిరంతరం కొట్లాడి జైలుకు పోయింది మేమే. 317 జీవోపై దీక్ష చేస్తే నా ఆఫీస్ గేటును గ్యాస్ కట్టర్లతో కట్ చేయించి టియర్ గ్యాస్ వదిలి అద్దాలు పగలకొట్టి లాఠీఛార్జ్ చేయించారు. అద్దాలు కాలికి గుచ్చుకుని రక్తమోడుతున్నా కనికరం లేకుండా బరబరా గుంజుకుపోయి జైలుకు పంపారు. ఉద్యోగుల పీఆర్సీ, టీఏ, డీఏల కోసం, ప్రతినెలా జీతాలివ్వాలని కొట్లాడి ఫాంహౌజ్ లో పడుకున్న కేసీఆర్ ను ఇందిరా పార్క్ కు గుంజుకొచ్చిన చరిత్ర బీజేపీదే. గ్రూప్ 1 అభ్యర్థుల పక్షాన కొట్లాడింది బీజేపీయే. కాంగ్రెస్ ఎన్నడైనా కొట్లాడిందా? ఆ పార్టీ నాయకులు టీచర్లు, నిరుద్యోగుల కోసం ఎన్నడైనా జైలుకు వెళ్లారా? ఆనాడు తపస్ మినహా ఏ ఉపాధ్యాయ సంఘమైనా టీచర్లకు అండగా నిలిచాయా? ఉద్యోగులు, నిరుద్యోగులు,ప్రజల పక్షాన పోరాడినందుకు ఇయాళ బీజేపీలో ఒక్కో కార్యకర్తపై 10కిపైగా కేసులు నమోదయ్యాయని, రౌడీషీట్లు మేధావులారా ఆలోచించండి. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్.ప్రతి నిరుద్యోగికి రూ.56 వేల భ్రుతి బాకీ పడ్డరు. ప్రతి టీచర్, ఉద్యోగికి 4 డీఏలు, పీఆర్సీ బాకీ పడ్డరు. ప్రతి మహిళకు తులం బంగారం,స్కూటీ బాకీ పడ్డరు. రైతులకు రుణమాఫీ,బోనస్,రైతు భరోసా పైసలు బాకీ పడ్డరు. ప్రతి ఉద్యోగికి సరెండర్ లీవ్ ఎన్ క్యాష్ మెంట్ పైసలు బాకీ. ఎటు చూసినా బాకీ బాకీ బాకీ ఇది బాకీల ప్రభుత్వం ఈ బాకీల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండకేసి బాదండి.మోదీ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదు.10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాట ఇచ్చి ఏ చిన్న పొరపాటు లేకుండా నయాపైసా అవినీతి లేకుండా ఇప్పటికే 9 లక్షల 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి అపాయిట్ మెంట్ లెటర్లు ఇచ్చిన ఘనత బీజేపీదే. ఉద్యోగులందరికీ 12 లక్షల 75 వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు ఇచ్చిన ఘనత మోదీ సర్కార్ దే. ఇయాళ పేపర్ల చూసిన.‘‘సివిల్ సర్వెంట్ల పనితీరు బాగోలేదు.ఒక్క తప్పు చేయాలని చెబితే 3 తప్పులు చేస్తున్నారు.ఏసీ రూంలను వదిలి బయటకు రావడం లేదు’’అని సీఎం మాట్లాడుతున్నడు. ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మీరే ఒక్క తప్పు చేయాలని అంటే వాళ్లు 3 తప్పులు చేయకుండా ఎట్లా ఉంటారు? ముఖ్యమంత్రే తప్పులు చేస్తున్నట్లు ఒప్పుకున్నడు.అసలు తప్పే జరగకుండా చూడాల్సిన మీరే తప్పు చేయాలని అంటే ఏ సందేశం పంపుతున్నట్లు? సీఎం వ్యాఖ్యలు చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎప్పుడుంటుందో, ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.ఇప్పటికే మంత్రులు,ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది. కొందరు మంత్రులైతే ప్రతి పనికి 15 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగొక్కోంటోంది.బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి బిల్లు పంపితే కేంద్రం ఎట్లా ఆమోదిస్తుంది? మేమేమైనా ఎడ్డోళ్లమా? ముస్లింలను బీసీల్లో ఎట్లా కలుపుతారు?మేం మొలదారం కట్టుకుంటాం. మాకు గోత్రం ఉంటది. వాళ్లతో మాకు పోలికేంది? ముస్లింలను బీసీ జాబితా నుండి తీసివేస్తే ఆ బిల్లును ఆమోదింపజేసే బాధ్యత మేం తీసుకుంటాం. లేకుంటే ఆమోదించే ప్రసక్తే లేదు. ముస్లింలను బీసీల్లో కలిపి అన్యాయం చేస్తున్నారు. కొందరు క్రైస్తవులు ఎస్సీ సర్టిఫికేట్లు తీసుకుంటూ ఎస్సీలకు నష్టం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బీసీ, ఎస్సీ సంఘాలేం చేస్తున్నాయి? ఎందుకు స్పందించడం లేదు? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే మీ పనా? ఒక వర్గానికి కొమ్ము కాయాలని హిందూ సమాజానికి తీరని నష్టం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో మేధావులంతా గుణపాఠం చెప్పాలని కోరుతున్నా అన్నారు. ఈ సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, జి.నగేశ్, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల శంకర్, పాల్వాయి హరీష్ బాబు మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్ రావు, డి.శంకర్ పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్