కరీంనగర్, నవంబర్ 20, (వాయిస్ టుడే): బీజేపీకి ఓటు వేసినా.. మోరిలో ఓటు వేసిన ఒకటే అని ఆర్థిఖ శాఖ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం గజ్వేల్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ఈటెల రాజేందర్ తిన్నింటి వాసాలు లెక్కబెట్టారని, అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టిండని మండిపడ్డారు. ఈటెలను ఎమ్మెల్యే చేసింది, మంత్రిని చేసింది.. శాసన సభ పక్ష లీడర్‌ను చేసింది సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు.తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఈటెలను ఓడించి బుద్ది చెప్పాలని గజ్వేల్ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి మన ప్రొఫెసర్ జయశంకర్ సారును కించపరిచేలా మాట్లాడారన్నారు. నీళ్లు, నిధులు నియామకాలు నినాదం లేదంటూ మాటలు పడేసుకున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ-కాంగ్రెస్ రెండు తొడుదొంగలని విమర్శించారు. ఈసారి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎం గెలిపిస్తే గజ్వేల్ పేరు మరోసారి మారు మోగుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.