Monday, February 23, 2026

 అశాస్త్రీయంగా అసంబద్ధంగా డీ లిమిటేషన్ ముసాయిదా:మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు

- Advertisement -

 అశాస్త్రీయంగా అసంబద్ధంగా డీ లిమిటేషన్ ముసాయిదా
కరీంనగర్

Delimitation draft is unscientific and absurd: Former Mayor Yadagiri Sunil Rao

కరీంనగర్ నగరపాలక సంస్థను 66 డివిజన్లుగా ప్రకటించిన డీ లిమిటేషన్ ముసాయిదా…పూర్తిగా అశాస్త్రీయంగా అసంబద్ధంగా ఉందని… భారతీయ జనతా పార్టీ పక్షాన ముసాయిదాను వ్యతిరేకిస్తున్నట్లు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు.

కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో గురువారం రోజున ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ లు కక్షపూరితంగా  కుట్ర చేసి… బలమైన ప్రతిపక్షం ఉన్నచోట వారు  మాత్రమే లబ్ధి పొందడానికి డివిజన్లను విభజన చేశారని మండి పడ్డారు. ప్రజా క్షేత్రంలో కొట్లాడటం చేతకాక…ప్రత్యర్థులను ఎదుర్కోలేక డీ లిమిటేషన్ పక్రియలో కుట్రలు చేశారని ద్వజమెత్తారు. కరీంనగర్ లో ఏ ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం సాదిస్తుందని…బీజేపి వైపే ప్రజలు ఉన్నారని భావించి ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుట్రలకు తెరలేపారని నిప్పులు చెరిగారు. నగరపాలక సంస్థ అశాస్త్రీయంగా విడుదల చేసిన డివిజన్ల విభజన ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటేనే ఎంఐఎం అధికారంలోకి వచ్చినట్లేనని మండపడ్డారు. 2005 లో తొమ్మిది మంది ఎంఐఎం కార్పోరేటర్లు గెలిచేలా డివిజన్ల విభజన చేసి… ఎంఐఎం పార్టీకి డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మండిపడ్డారు. దాని కొనసాగింపుగానే 2025 లో మల్లీ ఎంఐఎం పార్టీకి మేయర్ పీఠం కట్టబెట్టే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి డివిజన్ల విభజను అశాస్త్రీయంగా చేయడం జరిగిందని అన్నారు. ఎంఐఎం పార్టీకి కరీంనగర్ కార్పోరేషన్ కట్టెబెట్టే కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నిప్పులు చెరిగారు. ఈ మోసపూరిత చర్యను బారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆక్షేపించడం జరుగుతుందని తెలిపారు. కరీంనగర్ లో జరిగిన అభివృద్ధి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వతా స్మార్ట్ సిటీకి నిధులు తీసుకోచ్చి గత 5 సంవత్సరాల కాలంలో  నగరాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేశారని అన్నారు. నగరం సుంధరంగా తయారైందన్న విషయం ప్రజల కళ్లకు కనబడుతుందని తెలిపారు.
ఈ అభివృద్ధిని చూసి నగర ప్రజలంతా… మల్లీ బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో నగరపాలక సంస్థ ఉన్నట్లయితే ఇంగా గొప్పగా అభివృద్ధి చెందుతుందనే ఆశతో ప్రజలు బీజేపి వైపు చూస్తుంటే… దాన్ని ఒర్వలేక… తట్టుకొక కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ నాయకులు తెరచాటు ఒప్పందాలు పెట్టుకొని డివిజన్లను అశాస్తీయంగా విభజన చేసి నగర ప్రజలను మరో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

స్మార్ట్ సిటీ నిధులే కాకుండా బండి సంజయ్ కుమార్ గత ఐదు సంవత్సరాల కాలంలో అమృత్ పథకంలో రు 132 కోట్ల నిధులతో నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీటి సౌకర్యం కల్పించింది కేంద్ర ప్రభుత్వం చొరవే అన్నారు.అమృత్ 2 పథకంలో విలీన గ్రామాలకు సంబంధించీ రూ 147 కోట్ల నిధులు తెచ్చి ప్రస్తుతం విలీన గ్రామాల ప్రజలకు త్రాగు అందించడానికి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు.నగర ప్రజలు పూర్తిస్థాయిలో గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారం నగర పాలక సంస్థకు నిధులు మంజూరు చేయకున్న నగరం ఇంత గొప్పగా అభివృద్ధి చెందింది అంటే అది కేవలం కేంద్ర మంత్రి బండి సజయ్ కుమార్ రే కారణం అని ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వసిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు సేవలు అందించే కేంద్ర మంత్రిని ఎదో విదంగా సైడ్ ట్రాక్ చేయాలని…. డివిజన్లను అనుకూలంగా చేస్కోని భారతీయ జనతా పార్టని అడ్డుకునే కుట్ర చేస్తున్నారని అన్నారు. ఈ కుట్రలో భాగంగానే నగరపాలక సంస్థ డివిజన్ల డీ లిమిటేషన్ ప్రక్రియ అశాస్తీయంగా చేశారని మండి పడ్డారు.
కరీంనగర్ లో ఏ సమస్య పరిష్కారం కావాలన్నా…. ప్రజలకు మెరుగైన సేవలు అంశాలన్నా…. మంచి సౌకర్యాలు కలగాలన్నా…. భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమన్నారు.

ఏళ్ల తరబడి డంపు యార్డు కంపుతో ఇబ్బందులు పడుతూ… అనారోగ్యాలకు గురౌతున్న నగరపాలక సంస్థ డంపింగ్ యార్డు సమస్య కూడ భారతీయ జనతా పార్టీ వల్లే సాధ్యమౌతుందని తెలిపారు. గత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలకవర్గంలో ఏనాడు డంపు యార్డును తొలగించాలనే ఆలోచన చేయలేదని నిప్పులు చెరిగారు. గత కొద్దిరోజుల క్రీతమే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డంపు యార్డును సమూలంగా ప్రక్షాలన చేయాలని…. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహార్ లాల్ కట్టర్ తీసుకొచ్చి…. డంపుయార్డు శాశ్వత పరిష్కారం చేసే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుండి డంపు యార్డు ప్రక్షాలన కోసం నిధులు రావడం జరుగుతుందని తెలిపారు. దీంతో ఎంతొ కాలంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్య పరిష్కారం కాబోతుందని తెలిపారు. కరీంనగర్ లోని రైల్వే స్టేషన్ ను గొప్పగా అధునీకరించి…. ప్రజలకు సౌకర్యం కలిగిందంటే దానికి కారణం బండి సంజయ్, భారతీయ జనతా పార్టే కారణం. ఇవన్ని చూసి ఒర్వలేక….కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకొని డివిజన్లను విభజన చేశారని తెలిపారు.

అశాస్తీయంగా, అసంబందంగా చేసిన డివిజన్ల విభజనను జిల్లా కలెక్టర్, కమీషనర్లు మార్చేందుకు చొరవ తీస్కోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడెక్కడైతే కుట్రలకు తెరలేపారో అక్కడ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా డీ లిమిటేషన్ చేసి ప్రజల ముందు ఎన్నికలకు పోవాలని డిమాండ్ చేశారు. అధికారులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుట్రలు చేస్తూ…. భారతీయ జనతా పార్టీ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, ఎంఐఎం, పార్టీలు ఎన్ని కుట్టలు చేసిన… అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా… నగర ప్రజల మద్దతుతో బల్దీయాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అన్నారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలకు తెరలు లేపినా… బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరని అన్నారు. కుట్రలు కుతంత్రాలకు తెరదింపి డివిజన్ల విభజనను శాస్త్రీయ బద్దంగా చట్టబద్ధంగా బౌండరీలను, ఓటర్లను పరిగణలోకి తీస్కోని మల్లీ డీ లిమిటేషన్ ప్రక్రియను చేయాలని డిమాండ చేశారు. డివిజన్ల విభజన విభజన విషయంలో ఎక్కడైతే తప్పులు జరిగాయో వాటి పై భారతీయ జనతా పార్టీ తరుపున జిల్లా కలెక్టర్, కమీషనర్ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిల్లపు రమేష్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు చొప్పరి జయశ్రీ, రాపర్తి విజయ, వంగల పవన్ కుమార్, కాసర్ల ఆనంద్ కుమార్, దుర్షేద్ అనుప్, బండ రమణారెడ్డి, తాడేపు చంద్రమౌళి, కొండపల్లి సతీష్, కొలిపాక శ్రీనివాస్, నాయకులు లోకేష్, శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్