- Advertisement -
ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Demolition of footpath encroachments
రాజేంద్రనగర్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఫుట్ పాత్ లను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై జీహెచ్ ఎంసీ అధికారులు కొరడా ఝుళిపించారు. లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు రోడ్డుకు ఇరువైపులా ఫుట్ పాత్ లను ఆక్రమించి వేసిన డబ్బాలు , షెడ్లను రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది జేసీబీ ల సాయంతో కూల్చివేశారు.
లక్ష్మీగూడ నుంచి వాంబే కాలనీ వరకు పోలీస్ బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు కొనసాగాయి.అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫుట్ పాత్ కు సంబంధం లేని వాటిని కూడా కూల్చివేశరని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -