Tuesday, May 12, 2026

మందకృష్ణ మాదిగ అక్రమ కట్టడాలు కూల్చివేత

- Advertisement -

మందకృష్ణ మాదిగ అక్రమ కట్టడాలు కూల్చివేత

Demolition of illegal buildings in Mandakrishna Madiga

వరంగల్

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు చెందిన వరంగల్ లోని కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు కూల్చేశారు. హంటర్ రోడ్డులో ఉన్న తమకు చెందిన 400 గజాలను మందకృష్ణతో పాటు మరో ఇద్దరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ గతంలో మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు చేశారు.
అక్రమ నిర్మాణాలను కూల్చివేయలేదని, తన భూమిని ఇంకా ఆక్రమించి ఉన్నారంటూ నంబూరి చారుమతి అనే మహిళ జాతీయ మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. అధికారులు దీనిపై విచారించి ఇది అక్రమ కట్టడాలుగా తేల్చారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ఈ నెల 24వ తేదీ లోపు అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని ఆదేశిం చింది. దీనిపై మంద కృష్ణ మాదిగ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది ఆ కట్టడాలను కూల్చివేశారు.
వరంగల్ హంటర్‌ రోడ్డులో తమకు చెందిన 400 గజాలను మందకృష్ణ మాదిగతో పాటు జ్యోతి, ఇద్దయ్యలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని రెండున్నరేళ్ల క్రితం అధికారులకు నంబూరి చారుమతి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన ఉన్నతాధికారులు ఆక్రమణ నిజమేనని తేల్చి కట్టడా లను కూల్చి వేయాలని 2022 సెప్టెంబరులో ఆదేశాలిచ్చారు.
రెండేళ్లు దాటినా కూల్చి వేయలేదని చారుమతి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించగా జనవరి 24లోపు నిర్మాణా లను నేలమట్టం చేయాలని ఆదేశించింది. ఎన్‌హెచ్‌ ఆర్‌సీ ఉత్తర్వులను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ హైకోర్టును ఆశ్రయిం చినా ఊరట దక్కలేదు. దీంతో మున్సిపల్‌ సిబ్బంది కట్టడాలను కూల్చివేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్