రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది
Demon rule continues in the stateబిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికిల శ్రావణ్
___
మా బిడ్డల ప్రాణాలాంటే అంత చులకన
___
లోపలికి అనుమతించకపోవడంతో, గేటు ముందు ధర్నా
తాండూర్
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజా పాలన కాదు రాక్షస పాలన జరుగుతున్నదని బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు బడికిల శ్రావణ్ మండిపడ్డారు ఈ మేరకు గురువారం
తాండూరు మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే MJB గురుకుల పాఠశాల సందర్శనకు వచ్చిన సందర్భంగా లోపలికి అనుమతించకపోవడంతో అక్కడి వసతి గృహం గేటు ముందు బైఠాయించి ధర్నా అనంతరం శ్రావణ్ మాట్లాడుతూ
గురుకుల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పార్టీ కార్యక్రమం గురుకుల బాటలో భాగంగా గురువారం తాండూరు మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే MJB గురుకుల సందర్శనకు వెళ్లిన ఆయనను యాజమాన్యం అనుమతించలేదు. దీంతో BRSV నాయకులు, కార్యకర్తలతో కలిసి పాఠశాల ముందు ధర్నాకు దిగారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, సౌకర్యాలను అధ్యయనం చేసేందుకు వచ్చిన తమరిని పోలీసులకు ఫిర్యాదు చేసి అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. పాఠశాల గేటు ముందు ఆందోళనలు దిగిన బడికల శ్రావణ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలో సౌకర్యాలు సరిగా లేక ఫుడ్ పాయిజన్ తో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 48 మంది విద్యార్థులు చనిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. కెసిఆర్ పాలనలో 1000కి పైగా గురుకులాలను ఏర్పాటు చేసి గొప్పగా సౌకర్యాలు కలిపిస్తే.. కాంగ్రెస్ ప్రజా పాలనలో బ్రష్టు పట్టిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకోకూడదనే ఒక కుట్రపూరిత ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతోపాటు నిధులు కూడా కేటాయించడం లేదని ఆయన విమర్శించారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. డిక్లరేషన్లు, ఆరు గ్యారెంటీలు పేరుతో అధికారంలోకి ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయలేదని ఆరోపించారు. గురుకులల్లో సరైన సౌకర్యాలు లేక అనేకమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గురుకులాలపై కనీసం సమీక్ష చేసే సమయం కూడా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అర్థం చేసుకోవాలని అన్నారు. పేద పిల్లల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని, అందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.




