- Advertisement -
మధిరలో ఉప ముఖ్యమంత్రి పర్యటన
Deputy Chief Minister's visit to Madiraమధిర
భారీ వర్షాలు నేపథ్యంలో మధిర నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు చిరుమర్రి గ్రామంలో ఆత్మీయ స్వాగతం లభించింది. ఇప్పటికే వరదలు వచ్చిన నేపథ్యంలో జరిగిన పంట పొలాలకు వెళ్లి పరిశీలించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు అయన తెలిపారు. జరిగిన మొత్తం నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు తెలిపారు. అంతేకాక సాంకేతిక ఇబ్బందులు సమాచార లోపంతో ఎవరికైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కానీ వారు సంబంధిత అధికారులను కలవాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్క మరోసారి పునరుద్ఘాటించారు. మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు.
- Advertisement -




