భూపాలపల్లి ఎన్నికల వ్యయ పరిశీలకులు కౌశిక్ రాయ్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల పై వచ్చే ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం
అక్రమ నగదు, మధ్యం పంపిణీ జర్గకుండా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు
పేడ్ న్యూస్, సోషల్ మీడియా లపై ఎక్కువ దృష్టి సారించాలి
భూపాలపల్లి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల వ్యయ వివరాల నమోదు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు
జయశంకర్ భూపాలపల్లి: భూపాల్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వివరాలను పకడ్బందీగా నిబంధన మేరకు నమోదు చేయాలని భూపాల్ పల్లి ఎన్నికల పరిశీలకులు కౌశిక్ రాయ్ అన్నారు.
శనివారం సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో లో భూపాలపల్లి ఎన్నికల వ్యయ పరిశీలకులు కౌశిక్ రాయ్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా తో కలిసి భూపాలపల్లి నియోజకవర్గ ఎన్నికల వ్యయ వివరాల నమోదు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. భూపాల్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలు, అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల నమోదు కోసం ఏర్పాటుచేసిన బృందాలు వాటి పనితీరు తదితర అంశాలను జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా వివరించారు.
భూపాలపల్లి ఎన్నికల వ్యయ పరిశీలకులు కౌశిక్ రాయ్ మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులు నమోదు కోసం ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వేడ్ బృందాలు స్టాటిక్ సర్వేలన్సు బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు, వీడియో వ్యూయింగ్ బృందాలు పకడ్బందిగా విధులు నిర్వహించాలని అన్నారు.
ఎన్నికల సమయంలో నగదు బంగారం, వస్తువుల పంపిణీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఫిర్యాదులు సమాచారం తీసుకుంటూ పకడ్బందీగా విధులు నిర్వహించాలని అన్నారు. సహాయ వ్యయ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, సహాయ వ్యయ పరిశీలన అధికారులు రిటర్నింగ్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.అనుమానాస్పద బ్యాంక్ లావా దేవీ లు,10 లక్షల కంటే మించి నగదు జమ, ఉపసంహరణ, ఆన్లైన్ ద్వారా మల్టిపుల్ లావా దేవీ లపై పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఐన్ కం టాక్స్, వాణిజ్య పన్నుల శాఖ, వ్యయ పరిశీలన శాఖలు ఎన్నికల వ్యయం నమోదు లో సమన్వయము తో పని చేయాలని అన్నారు. ఎం సి ఎం సి కమిటీ ద్వారా రోజువారి దిన పత్రికల్లో , లోకల్ ఛానెల్ లో వచ్చే పేడ్ న్యూస్ పై దృష్టి సారించాలన్నారు. సోషల్ మీడియా పై పటిష్టంగా ఉంచాలన్నారు.
రాజకీయ సభ్యులు సమావేశాలు నిర్వహించే సమయంలో వాటిని నిశితంగా రికార్డ్ చేయాలని, అక్కడ వినియోగించే ప్రతి వస్తు రేట్ చార్ట్ ప్రకారం అభ్యర్థి ఎన్నికల ఖాతాలో నమోదు జరిగే విధంగా నిబంధనలో మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అర్.డి. ఓ. రమాదేవి, డి.ఎస్పీ.రాములు , ఐ టి అధికారులు, వి.ఎస్.టి., ఎస్.ఎస్.టి., ఎం.సి.సి., ఎం.సి.ఎం.సి , టీమ్ ల అధికారులు, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.