ఎల్బీనగర్, వనస్థలిపురం, వాయిస్ టుడే: ఎల్బీనగర్ నియోజకవవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందని ఎల్బీనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్ ఉదయనగర్ కాలనీ సంఘం భవనంలో కాలనీవాసులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ లోనే ఎక్కడాలేని విధంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్ పాసుల నిర్మాణం, అధునాతనమైన పార్కుల ఏర్పాటుతో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎల్బీనగర్ లో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి, నల్ల రఘుమారెడ్డి, సుంకోజు కృష్ణమాచారి, ఓరుగంటి వెంకటేష్ గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, రాజిరెడ్డి, అనంతరెడ్డి, నరసింహ ముదిరాజ్, ఢిల్లీ గోపాల్ ముదిరాజ్, రాధిక, జనార్దన్ పటేల్, నరేందర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.




