ఎల్బీనగర్, వాయిస్ టుడే: కోట్లాది రూపాయల వ్యయంతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత తమకే దక్కుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ పరిధిలోని పార్థివాడబస్తీలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థివాడబస్తీ పెద్దలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో సుధీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బస్తీలో అమ్మవారి దేవాలయం, యువతకు ఉద్యోగాలు, మహిళల జీవనోపాధి కోసం శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నికలు ఏమైనా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. రాష్ట్రంలో అన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీకే అధికారాన్ని చూపిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు. 9 ఏళ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని, పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనను కొనసాగించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. తనను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ లగ్గోని శ్రీధర్ గౌడ్, సీనియర్ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్, ఖైసర్, మధుగౌడ్, వేములయ్య గౌడ్, గడాల రాజు, నవీద్, బస్తీవాసులు రాజేష్ కన్నా, గులాబ్ సింగ్, విజయ్ కుమార్, దయనంద్, యాదిలాల్, గణేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.