కంటోన్మెంట్, అక్టోబర్ 27 (వాయిస్ టుడే ప్రతినిధి): నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో కూడా బిజెపి అధికారంలోకి వస్తుందని, 150వ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక తెలిపారు. శుక్రవారం నాడు మోండా డివిజన్ పరిధిలోని స్థానిక బిజెపి నాయకులతో కలిసి ఆమె పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కొంతం దీపిక మాట్లాడుతూ… రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని, రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో కబ్జాలు, నీతి నియమాలు లేని సిద్ధాంతాలను కొనసాగిస్తున్నారని ఆమె తెలిపారు. బిజెపి ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి, రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని డబల్ ఇంజన్ సర్కార్ అమలవుతే తెలంగాణ రాష్ట్రం మరేంతో అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. అభ్యర్థులు ఎవరు నిలబడ్డ బిజెపి పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారితో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కొంతం నరేష్, అశోక్, సర్వేశ్, సత్యనారాయణ, కాళీ చరణ్, ప్రశాంత్, దయారామ్, సురేష్, వినయ్, హరి, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బిజెపి సర్కార్ తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి
Published By Voice Today Team
301
- Advertisement -
- Advertisement -
- Tags
- bjp # telangana #
- bjp in telangana
- bjp meeting telangana
- congress vs brs vs bjp in telangana
- formation of telangana
- government of telangana
- party over? bjp blasts rahul gandhi with his video
- pm modi telangana visit
- telangana bjp
- telangana election date
- telangana latest news
- telangana movement
- telangana movement in hindi
- telangana state bill
- telangana updates
- the creation of telangana
- who is winning telangana election
- yogi adityanath in telangana



