ఆలయాల అభివృద్ధి
పనులకు రు. 85 లక్షల నిధులు
మంజూరు.
నిధుల మంజూరుపై నియోజక వర్గ ప్రజల హర్షం
జగిత్యాల, ఫిబ్రవరి 17
జగిత్యాల నియోజక వర్గంలోని వివిధ గ్రామాల్లోని పలు ఆలయాల అభివృద్ధి పనుల నిర్మాణం కోసం ప్రజల విన్నపం మేరకు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి రు.85 లక్షలు మంజూరు చేసినట్లు పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి వెల్లడించారు.జగిత్యాల నియోజక వర్గంలోని వివిధ ఆలయాల అభివృద్ధి పనులకు మంజూరు చేసిన నిధులు జగిత్యాల కోదండ రామాలయం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రు.10 లక్షలు, కిచేన్ స్టోర్ రూం నిర్మాణం కోసం రు.10 లక్షలు, జగిత్యాల పట్టణంలోని ఎడ్ల అంగడి సమీపంలోని రామాలయం ప్రహారీ నిర్మాణానికి రు.10 లక్షలు, లక్ష్మిపూర్ లోని రామాలయం ప్రహారీ నిర్మాణం కోసం రు.5 లక్షలు,కన్నపూర్ ఎల్లమ్మ దేవాలయం ప్రహారీ నిర్మాణానికి రు.5 లక్షలు, పొరండ్ల గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం ప్రహారీ కోసం రు.5 లక్షలు, లింగం పేటలోని శివాలయం ప్రహారీ నిర్మాణానికి రు.5 లక్షలు,జగిత్యాల పట్టణంలోని గాయత్రి టెంపుల్ ప్రహారి కోసం రు.5 లక్షలు, దగ్గులమ్మ ఆలయం సమీపంలో కమ్యూనిటీ హల్ నిర్మాణం కోసం రు.10 లక్షలు, ఉప్పరి పేటలోని హనుమాన్ ఆలయం ప్రహారీకి రు.5 లక్షలు, తాటిపల్లి లోని సురభి గోశాల ప్రహారీ నిర్మాణం కోసం రు.10 లక్షలు, బీర్ పూర్ మండలం కోల్వాయి లోని ఎల్లమ్మ ఆలయ ప్రహారీ కి రు.5 లక్షలు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి మంజూరు చేసీనట్లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.నియోజక వర్గంలోని ఆలయాల అభివృద్ధి పనుల నిర్మాణం కోసం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రు.85 లక్షలు మంజూరు చేయడం పై నియోజక వర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేయడం తోపాటు, నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.