మేడ్చల్: నియోజకవర్గంలో 9వేల కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఎలక్ట్రిసిటీ, లాంటి అభివృద్ధి పనులు చేయడం జరిగిందని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాంధీ తెలిపారు. ఎన్నికల ప్రచారం ప్రచారంలో భాగంగా చందానగర్ డివిజన్లోని శంకర్ నగర్ లో గాంధీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా గాంధీ మాట్లాడుతూ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేసి తనని ఆశీర్వదించాలని కోరారు. కేంద్రంలోని బిజెపి నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విడిచిందని తీవ్రంగా ఆరోపించారు. చివరికి ఉప్పు పప్పు వంట నూనె, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల జీవితాలను చిన్న బిన్నం చేసిందని గాంధీ ఘాటుగా విమర్శించారు. కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో తోపాటు చేసిన అభివృద్ధి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.




