సనత్ నగర్ లో మంత్రుల పర్యటన

హైదరాబాద్: విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులను తీర్చిదిద్దుతామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, బన్సీలాల్ పేట లోని ప్రభుత్వ పాఠశాలలో 1.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంత్రులు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి మేకల మండి పాఠశాలను హై స్కూల్ గా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు పేద విద్యార్ధులు అధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో మన బస్తీ మన బడి కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నాం . తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సన్నబియ్యం తో నాణ్యమైన భోజనం, వారానికి 3 రోజులు రాగిజావా అందిస్తున్నాని అన్నారు.




