- Advertisement -
ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గురువారం నామినేషన్ వేస్తున్న సందర్భంగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కమల దంపతులు వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా దిల్ సుఖ్ నగర్ లోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం, కొత్తపేటలోని లక్ష్మీనరసింహాస్వామి దేవాలయం, కర్మన్ ఘాట్ లోని ధ్యానాంజనేయ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు దేవాలయల చైర్మన్లు, ధర్మకర్తలు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -