Wednesday, February 11, 2026

సమన్వయంతో భక్తులకు సాఫీ దర్శనం కల్పించాలి – వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి ఐపీఎస్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

- Advertisement -

సమన్వయంతో భక్తులకు సాఫీ దర్శనం కల్పించాలి – వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి ఐపీఎస్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఉన్నతాధికారుల పరిశీలన

వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా:వాయిస్ టుడే

Devotees should be provided with smooth darshan through coordination – Vemulawada ASP Ruthvik Sai IPS, Additional Collector Gaddam Nagesh

మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమన్వయంతో సాఫీ దర్శనం కల్పించాలని వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి ఐపీఎస్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను మంగళవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లు, భక్తుల ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు, పార్కింగ్ సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా అధిక రద్దీ ఉండే ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆలయ ఈవో ఎల్. రమాదేవి, వేములవాడ ఆర్డీవో రాధాబాయి, ఈఈ రాజేష్, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, డీఈ మైపాల్ రెడ్డి, ఆలయ ఇంచార్జ్ చానా స్థానాచార్యులు, నమిలికొండ ఉమేష్ శర్మ, పోలీస్ అధికారులు, ఆలయ ఉద్యోగులు, అర్చకులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్