
చారిత్రక గోల్కొండ కోటలో ఆగష్టు 15న నిర్వహించనునున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శుక్రవారం డిజిపి అంజనీకుమార్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి ఆగష్టు 15న ఉదయం సికింద్రాబాద్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం, ఉదయం11 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని డీజీపీ తెలిపారు. ఈకార్యక్రమానికి ఎలాంటి అవాంతరాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశానికి నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్, అడిషనల్ డీజీ స్వాతి లక్రా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్, టూరిజం కార్పొరేషన్ ఎండి మనోహర్, టిఎస్ఐఐసి ఎండి నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.



