ముక్కోటికి ధర్మపురి ముస్తాబు
జగిత్యాల
దక్షిణ కాశిగా పేరు ప్రక్యాతి గాంచిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరగనున్నాయి… సంవత్సరంలో కేవలం ముక్కోటి ఏకాదశి రోజు తెరుచుకోనున్న వైకుంఠ ద్వార తలుపులను రేపు ఉదయం ప్రాత:కాలమున 5 గంటలకు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వైకుంఠ ద్వారం తెరుచుకొనుంది, వైకుంఠ ద్వారం ద్వార లక్ష్మి నరసింహ స్వామి వార్లు బక్తులకు దర్శనం ఇవ్వనున్నారు… ఈ ఉత్సవాలకు బక్తులు పెద్దసంఖ్యలో తరలిరానున్న నేపధ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్ లను ఏర్పాట్లను చేస్తున్నారు…విద్యుత్ దీపలంకరణతో శ్రీ ధర్మపురి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం మిరుమిట్లు గొలుపుతు కొత్త శోభను సంతరించుకుంది… ఇప్పటికే ధర్మపురిలో ఓ పండుగా వాతావరం నెలకొంది… వైకుంఠద్వారం ద్వార స్వామి వారిని దర్శించుకుంటే కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయి అని బక్తుల ననమ్మకం …. రేపు సుమారుగా 60 వేలకు పైగా మంది బక్తులు వైకుంఠ ద్వారం స్వామి వారిని దర్శించు కొనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముక్కోటికి ధర్మపురి ముస్తాబు
- Advertisement -
- Advertisement -


