Wednesday, March 25, 2026

అంగన్వాడీల కలెక్టరేట్ ఎదుట ధర్నా

- Advertisement -

అంగన్వాడీల కలెక్టరేట్ ఎదుట ధర్నా

Dharna in front of Anganwadi Collectorate

భద్రాద్రి కొత్తగూడెం
రాష్ట్ర వ్యాప్తంగా అప్ గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు నెల నెల చెల్లించాల్సిన పెరిగిన వేతనాలను నెల నెలా కాకుండా ఒక నెల టీచర్ శాలరి, ఒక నెల హెల్పర్ శాలరి చెల్లించడాన్ని నిరసిస్తూ తెలంగాణా అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నాకు దిగారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ…. అప్ గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచి ఎందుకు చెల్లించరని, సాకులు ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించారు. ఒక నెల పెంచిన జీతం ఇస్తూ మరొక నెల పాత జీతం చెల్లించడం అన్యాయమని అని అన్నారు. సమస్య పరిస్కారం కొరకు అన్ని స్థాయిల అధికారులను కలిసిన సమస్య పరిష్కారం కాకపోవడంతో ధర్నాకు దిగామని అని అన్నారు. అప్ గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు తక్షణమే హెల్పర్లను కేటాయించాలని, పని భారం తగ్గించాలని, బిఎల్ఓ ల పేరిట వేధింపులు ఆపాలని అన్నారు. జీతాలు చెల్లించే విషయంలో వస్తున్న సాంకేతిక సమస్యలని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్