రెడ్డి వర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఛాన్స్ దక్కెనా?
ముస్లిం మైనారిటీకి ప్రాధాన్యత – ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ మంత్రివర్గంలో చేరతారా
రంగారెడ్డి జిల్లాకు న్యాయం – మల్ రెడ్డి రంగారెడ్డికి కీలక పదవి దక్కుతుందా?
ఐలయ్య, విజయశాంతి,ఇతర నేతలకు అవకాశం ఉంటుందా?
ఎస్సీ, ఎస్టీ వర్గాలనుంచి గడ్డం వివేక్, బాలు నాయక్ పేర్లు పరిగణనలో!
ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి వ్యూహం – 2029 ఎన్నికల దిశగా కాంగ్రెస్ ముందుకు
హైదరాబాద్: వాయిస్ టుడే
తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తయినా,ఇంకా కాబినెట్ లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
Did Komatireddy Rajagopal Reddy get a chance in the Reddy category?
జిల్లాల వారీగా మంత్రి పదవులకు ఆశావహులు ఎక్కువవడంతో కాబినెట్ కూర్పు ఆలస్యమవుతుంది. తెలంగాణలోని ప్రధాన జిల్లాల నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నవారి జాబితాను పరిశీలిస్తేనల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (రెడ్డి) –ఇప్పటికే మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు. మంత్రి పదవి కావాలంటూ అసమ్మతి గళం వినిపిస్తున్నారు. మరో వైపు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (బీసీ) –బీసీ కోటా లో తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. బాలు నాయక్ (ఎస్టీ) – దేవరకొండ నియోజకవర్గం నుంచి ఎస్టీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించా లని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుండి సీఎం రెవంత్ రెడ్డికి సమీప బంధువు సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఒక్క మంత్రి కూడా లేని తమ జిల్లాకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు..రెడ్డి వర్గంలో ఒక మంత్రి పదవి ఆయనకు దక్కే అవకాశాలు ఎక్కువ అనే చర్చ జరుగుతుంది.రంగారెడ్డి జిల్లా నుండి ప్రాతినిధ్యం లేకపోవడం తో కేబినెట్ లో మంత్రి గా అవకాశం కల్పించాలని మల్ రెడ్డి రంగారెడ్డి (రెడ్డి) –ఓ సి కోటా లో లాబీయింగ్ చేస్తున్నారు. మైనార్టీ లలో కూడా కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే లేకపోవడంతో ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ (ముస్లిం మైనారిటీ) – ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే కాంగ్రెస్ వ్యూహంలో కీలకమైన పేరుగా వినిపిస్తుంది..పెద్దపల్లి జిల్లా లో బలమైన నేత గా పేరున్నప్రేమ్ సాగర్ రావు (వెలమ)– వెలమ వర్గానికి మంత్రి పదవి ఖరారుచేసే అవకాశం ఉంది.మహబూబాబాద్ జిల్లా నుండి ఎస్సీ కోటా లో ఓ ఛానల్ అధినేత గడ్డం వివేక్ (ఎస్సీ మాల) – ఎస్సీ వర్గానికి మంత్రి గా ప్రాతినిధ్యం ఇవ్వాలనే డిమాండ్ తో అధిష్టానం పరిశీలనలో బలంగా ఉంది.
ఇప్పటికే కాబినెట్ లో ఉన్న పన్నెండు మంది మంత్రులలో రెడ్డి సామాజిక వర్గం నుండి –నలుగురు,బీసీ వర్గం నుండి ఇద్దరు, ఎస్సీ వర్గం నుండి ఇద్దరు ఎస్టీ వర్గం నుండి ఒకరు,మిగతా ముగ్గురు ఇతర సామాజిక వర్గాల నుండి ఉన్నారు.కాంగ్రెస్ నుండి ముస్లిం ఎమ్మెల్యే లు ఒక్కరు కూడా గెలవకపోవడంతో ముస్లిం మైనారిటీలు ఎవరు మంత్రులుగా లేరు.మంత్రివర్గంలో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవడంతో కాంగ్రెస్ వ్యూహంలో ముస్లిం వర్గానికి ఒక మంత్రి పదవి ఖాయమని సమాచారం ఉంది.
ఇక తెలంగాణ మంత్రివర్గంలో బీసి మహిళా మంత్రుల సంఖ్య తక్కువగా ఉంది.కొండా సురేఖ తో పాటు ఎస్టీ కోటా లో సీతక్క మంత్రిగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన సినీ నటి విజయశాంతి కి బీసీ కోటా లో మరో మహిళా మంత్రిగా పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి.
మొత్తంగా, తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కేవలం పదవుల పంపిణీ కాదని, రాబోయే ఎన్నికల వ్యూహానికి కీలకం అని స్పష్టమవుతోంది. రాబోయేరోజుల్లోఎవరెవరు మంత్రులు అవుతారు?ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం దక్కుతుంది?, కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.