Thursday, December 12, 2024

కవిత దూరం పెట్టారా.. ఉంచారా..?

- Advertisement -

కవిత దూరం పెట్టారా.. ఉంచారా..?

Did you put the Kavitha away.. did you keep it..?

హైదరాబాద్, సెప్టెంబర్ 20, (వాయిస్ టుడే)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్కడ? తీహార్ జైలు నుంచి విడుదలై మూడు వారాలు గడుస్తోందా? పార్టీకి ఆమె దూరంగా ఉన్నారా? ఉంచారా? ఎందుకు యాక్టివ్ కాలేకపోతున్నారు? ఇవే ప్రశ్నలు గులాబీ కార్యకర్తలను వెంటాడుతోంది.హోదాలో ఉన్న‌ప్పుడు చిన్న త‌ప్పు చేసినా స‌మాజం పెద్ద‌గా చూస్తుంది. ప‌దే ప‌దే ఆ తప్పును గుర్తు చేస్తూ వేలెత్తి చూపుతుంది. అదే పెద్ద త‌ప్పు చేస్తే.. వేలెత్తి చూప‌డంతోపాటు అవ‌మాన‌భారమూ ఉంటుంది. బీఆర్ఎస్ అధినేత‌, కేసీఆర్ కుమార్తె క‌విత కూడా ఆ విధంగా బాధ‌ప‌డుతున్నారట‌. గులాబీ బాస్ కేసీఆర్.. తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్య‌వ‌హ‌రించారు కూడా.క‌విత ఓసారి ఎంపీగా గెలిచి పార్ల‌మెంటులో అడుగుపెట్టారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసన కర్తల హోదాలో ఉన్న‌ప్ప‌టికీ లిక్క‌ర్ కేసులో అరెస్ట్ కావడంతో బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నారు. ముఖం చూపించలేక పోతున్నారు. జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆమె ధైర్యంగా ఉన్న‌ట్టు పైకి క‌నిపించారు. దేశం కోసం పోరాడి వ‌చ్చిన‌ట్టుగా ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికారు నేత‌లు, కార్యకర్తలు.నాది తెలంగాణ.. కేసీఆర్ బిడ్డ‌ను అంటూ చెప్పుకొచ్చారు. ఎవ్వ‌రినీ వ‌దిలి పెట్ట‌న‌ని వార్నింగ్ కూడా ఇచ్చారామె. ఆ తర్వాత ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యారు. ప‌ది రోజుల తర్వాత రాజ‌కీయాల్లో యాక్టివ్ అవుతారని, రెట్టింపు ఉత్సాహంతో ప‌ని చేస్తార‌ని బీఆర్ఎస్ అనుకూల మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. క‌విత బ‌య‌ట‌కు వ‌చ్చి మూడు వారాలు అవుతోంది.క‌విత ఫామ్ హౌస్‌కు వెళ్లిన‌ నుంచి ఆమె వార్త‌ల్లో నిలిచారు. ఆ తర్వాత ఆచూకీ క‌నిపించ‌లేదు. ఇప్ప‌టివ‌ర‌కు ఆమె మీడియాతో మాట్లాడిన సందర్భం రాలేదు. దానికి కొన్ని కార‌ణాలున్నాయ‌ని వార్తలు గుప్పుమన్నాయి. క‌విత విడుద‌లైన తర్వాత సరైన స్పందన లేదన్నది హార్డ్‌కోర్ అభిమానుల మాట.ఏమైనా మంచి ప‌ని చేసి జైలుకు వెళ్లిందా? లిక్క‌ర్ కేసులో వెళ్లిందంటూ వ్య‌తిరేక‌తే ఎక్కువ క‌నిపించిందట. ఆ అవ‌మాన‌ భారంతో ఫామ్‌ హౌస్ నుండి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నార‌నే వార్త‌లు పొలిటికల్ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నాయి.కేసీఆర్ మాత్రం కవితను పార్టీ అధ్యక్షురాలుగా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడితే, అదే జరిగితే కారులో అంతర్గత  కుమ్ములాట మొదలవుతుందని అంటున్నారు.కేసీఆర్ తర్వాత నెక్ట్స్ ఎవరనే దానిపై అంతర్గతంగా ఆ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ వైపు కేటీఆర్, మరోవైపు హరీష్‌రావు.. ఇంకో వైపు కవిత పోటీ పడుతున్నట్లు గతంలోనే వార్తలు హంగామా చేశాయి.ప్రస్తుత పరిస్థితుల్లో మహిళకు అధ్యక్షురాలి పదవి ఇస్తే.. అధికార పార్టీని నిలదీయవచ్చని అంటున్నారు. పార్టీకి పూర్వవైభవం వస్తుందని అంటున్నారు. ప్రజల నాడి, యాస అన్నీ కవితకు తెలుసని అంటున్నారు. ఒకవిధంగా ప్రజలను ఆకట్టుకోవడానికి సరైన అస్త్రంగా చెబుతున్నారు కొందరు నేతలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఈ పదవిని చేపడతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్