హైదరాబాద్: అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేపడతామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. దేశాన్ని 50 ఏళ్లకుపైగా పాలించిన పార్టీ కాంగ్రెస్సే అయినా ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయలేదన్నారు. అధికారం కోల్పోయి పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని తెలిసి ఓబీసీల జపం చేస్తున్నారని విమర్శించారు.
ఇది కాంగ్రెస్ పార్టీ స్వార్ధ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. తెలంగాణలో 2 శాతం ఓట్లు కూడా రాని భాజపా బీసీని సీఎం ఎట్లా చేస్తుందని రాహుల్ చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఒక ప్రకటనలో సంజయ్ మండిపడ్డారు. మొన్న కేసీఆర్ కుమారుడు కేటీఆర్, నిన్న రాహుల్ చేసిన వ్యాఖ్యలు.. తెలంగాణలో బీసీని సీఎం కాకుండా చేస్తున్న కుట్రలో భాగంగానే ఉన్నాయని విమర్శించారు. బీసీలకు తక్షణమే రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తరువాతే బీసీల ఓట్లు అడగాలన్నారు.
50ఏళ్లలో లేనిదీ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా : బండి
- Advertisement -
- Advertisement -