Thursday, March 19, 2026

కరీంనగర్ లో డిజిటల్ చాయ్ వాల

- Advertisement -

తెలంగాణలో మొదటి డిజిటల్ టీ దుకాణం కరీంనగర్లో ప్రారంభం

మార్కెటులో విడుదల చేసిన జేమ్ ఓపెన్‌క్యూబ్ టెక్నాలజీస్

కృత్రిమ మేదస్సు(AI)తో టీ మాస్టర్ లేని దుకాణం

కరీంనగర్ ప్రారంభోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్

Digital Chai Wala in Karimnagar
Digital Chai Wala in Karimnagar

కరీంనగర్,  సెప్టెంబర్ 12 (వాయిస్ టుడే): తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి డిజిటల్ టీ దుకాణం కరీంనగర్లో ప్రారంభమైంది, జెమ్ ఓపెన్‌క్యూబ్ టెక్నాలజీస్ ప్రై.లిమిటెడ్ కృత్రిమ మేధస్సు (AI – ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో రూపొందించిన ఈ WTC(వాటర్, టీ, కాఫీ) మెషిన్ సాంప్రదాయ టీ మాస్టర్ అవసరం అవసరం లేకుండా రోజుకి 24 గంటలు పనిచేస్తు టీ ప్రియులకు కొత్త శకానికి నాంది పలుకుతుంది.

WTC కరీంనగర్ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ రెడ్డవేని వంశి ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ఎదురుగా  “డిజిటల్ చాయ్ వాల” పేరుతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి-రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ మరియు ఇతర నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాంప్రదాయ టీ షాపుల మాదిరిగా కాకుండా, జెమ్ ఓపెన్‌క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ఈ WTC మెషిన్, టీ, కాఫీ, లెమన్ టీ, బాదం టీ, పాలు, బిస్కెట్లు మరియు చల్లబడిన వాటర్ బాటిళ్లను ఆటోమేటిక్ పద్దతిలో కేవలం క్యూఆర్ కోడ్ పై స్కాన్ చేయడం ద్వారా కష్టమర్లకు అందిస్తుంది. ఈ సందర్భంగా జేమ్ ఓపెన్‌క్యూబ్ టెక్నాలజీస్ సంస్థ సిఈఓ పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 600కి పైగా మెషీన్లు అమ్ముడయ్యాయని, ఈ త్రైమాసికంలో 10,000 WTC మెషీన్‌లను ఇన్‌స్టాల్ చేయాలనే లక్ష్యంతో, జెమ్ ఓపెన్‌క్యూబ్ ముందుకు వెళ్తుందని, కరీంనగర్ లో మా మొదటి మెషీన్ విడుదల పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, దేశవ్యాప్తంగా బుకింగ్ లు వస్తున్నాయని, 1 లక్ష 67 వేలకు లభ్యమయ్యే ఈ మెషీన్ ను టీ లవర్స్ ఉండే ప్రతిచోటకు అందుబాటులోకి  తీసుకువెళ్లడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు. కరీంనగర్‌కు చెందిన మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ వంశీ మాట్లాడుతూ, ఈ వినూత్న మెషీన్‌ మాస్టర్ డిస్ట్రిబ్యూషన్ ని దక్కించుకోవడం ఆనందంగా ఉందని, జిల్లా అంతటా WTC మెషీన్‌లను ప్రారంభించాలని అనుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం లో జెమ్ ఓపెన్‌క్యూబ్ ఎండి ఈ. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్