Wednesday, September 18, 2024

మే  4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్

- Advertisement -

మే  4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు చిత్ర పరిశ్రమ సమక్షంలో ఘనంగా డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి అయిన మే 4వ తేదీని డైరెక్టర్స్ డే ఈవెంట్ ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. మే 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ ను గ్రాండ్ గా జరపనున్నారు. ఈ ఈవెంట్ వివరాలను సోమవారం సాయంత్రం నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అసోసియేషన్ వెబ్ సైట్, డైరెక్టర్స్ డే ఈవెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుల సంఘం సంక్షేమ నిధికి రెబెల్ స్టార్ ప్రభాస్ 35 లక్షల రూపాయల విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో

తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ – మే 4న దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతి సందర్భంగా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్స్ డేను ఘనంగా నిర్వహించబోతున్నాం. మదర్స్ డే, ఫాదర్స్ డే ఉన్నట్లే డైరెక్టర్స్ డే కూడా అంతే పేరు తెచ్చుకోవాలి. తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ కు మొత్తం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమల్లో మంచి పేరుంది. ఇప్పటిదాకా మనం డైరెక్టర్స్ డేను ఇండోర్ లో చిన్నగా చేసుకున్నాం. ఈసారి ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. హరీశ్ శంకర్, మారుతి, అనిల్ రావిపూడి వంటి దర్శకులు బిజీగా ఉన్నా మన అసోసియేషన్ కార్యక్రమంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అసోసియేషన్ మన కుటుంబం అని ప్రతి ఒక్కరు భావించడం వల్లే ఈ ఈవెంట్ కోసం అందరం కష్టపడుతున్నాం. డైరెక్టర్స్ డే వేడుకల్లో చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ – డైరెక్టర్స్ డేను ఇప్పటిదాకా మామూలుగా నిర్వహిస్తూ వచ్చాం కానీ ఈసారి డైరెక్టర్స్ అసోసియేషన్ కు కొత్త కమిటీ వచ్చాక చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేశాం. మే 4న ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే ఈవెంట్ ఘనంగా నిర్వహించబోతున్నాం. మన స్టార్స్, దర్శకుల సంఘం కుటుంబ సభ్యులతో పాటు వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో ఈ ఈవెంట్ చేస్తున్నాం. ఇందుకు మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ – మన  డైరెక్టర్స్ అసోసియేషన్ లో గతంలోకి ఇప్పటికి తేడా కనిపిస్తోంది. నాలుగు గోడల మధ్యలో మనం ఇన్నాళ్లూ డైరెక్టర్స్ డే జరుపుకున్నాం. ఇప్పుడు ఘనంగా ఎల్బీ స్డేడియంలో చేసుకోబోతున్నాం. ఈ వేడుకలతో మన దర్శకుల సంఘం గొప్పదనాన్ని దేశమంతా చాటి చెప్పాలి. అన్నారు.
దర్శకుడు రాంప్రసాద్ మాట్లాడుతూ – డైరెక్టర్స్ డే నిర్వహణ అనేది మన అసోసియేషన్ తరపున ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి దర్శకుల సంఘం సత్తా చాటేలా డైరెక్టర్స్ డే వేడుకలు ఉండబోతున్నాయి. 24 విభాగాల నుంచి అందరం ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ వేడుకల్ని విజయంవంతం చేయబోతున్నాం. అన్నారు.
దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ – దర్శకుల సంఘంలో ప్రతి కమిటీ ఈ సభ్యుల సంక్షేమం కోసం అసోసియేషన్ అభివృద్ధి కోసం పాటుపడుతూ వస్తోంది. ఈసారి ఉన్న కమిటీ మరింతగా దాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈసారి డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఘనంగా నిర్వహిస్తున్న ఈ కమిటీ సభ్యులందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నా. అన్నారు.

డైరెక్టర్ సముద్ర మాట్లాడుతూ – తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరుపున డైరెక్టర్స్ డే వేడుకల్ని ఈసారి ఘనంగా నిర్వహించబోతున్న మన అసోసియేషన్ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నా. ఈ వేడుకలతో మన అసోసియేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియాలి. అన్నారు.
దర్శకుడు అనుదీప్ కేవి మాట్లాడుతూ – మే 4న జరిగే డైరెక్టర్స్ డే వేడుకల్ని మన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరుపున డైరెక్టర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాం. మన దర్శకులు రకరకాల స్కిట్స్, డ్యాన్సెస్ తో మిమ్మల్ని అలరిస్తారు. మీరంతా ఈ కార్యక్రమానికి వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు.
తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వశిష్ట మాట్లాడుతూ – ఈసారి డైరెక్టర్స్ డే ఈవెంట్ గ్రాండ్ గా ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముగ్గురు డెబ్యూ డైరెక్టర్స్ కు ఒక్కొక్కరికి లక్ష రూపాలయ చొప్పున ప్రోత్సాహకం అందిస్తాం. కొత్త దర్శకులకు ఎంకరేజింగ్ గా ఉండేలా ఈ ప్రైజ్ మనీ ఇస్తున్నాం. డైరెక్టర్స్ డేను మీరంతా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ – మన దర్శకుల సంఘానికి ఉన్న ఖ్యాతి మరే ఇండస్ట్రీకి లేదు. అత్యధిక సినిమాలను రూపొందించిన దర్శకుడిగా మన దర్శకరత్న దాసరి గారు గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించారు. ఆయన జయంతి అయిన మే 4న మనం డైరెక్టర్స్ డే జరుపుకుంటున్నాం. ఈసారి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో అవసరంలో ఉన్న ఎంతోమందికి ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ అండగా నిలబడుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ – మన ఆలోచనల్ని లక్షలాది మందికి చేరువేసే దర్శకులలో ఒకరిగా ఉన్నందుకు గర్వపడుతుంటాను. డైరెక్టర్స్ డే ఈవెంట్ కల్చరల్ కమిటీలో ఉన్నాను. మన స్టార్ హీరోలను చాలా మందిని పర్సనల్ గా వెళ్లి కలిశారు మన సంఘ సభ్యులు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మెగాస్టార్ చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు, శ్రీకాంత్ గారు, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్, నాని, సాయి ధరమ్ తేజ్, అల్లరి నరేష్..ఇలా హీరోలంతా వస్తున్నారు. మిగతా స్టార్స్ ను కూడా కలుస్తాం. మనకు బ్లాక్ బస్టర్స్ తీయడం కొత్త కాదు, మే4న జరగబోయే ఈవెంట్ ను కూడా బ్లాక్ బస్టర్ చేద్దాం. అన్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ – డైరెక్టర్స్ డే ఈవెంట్ ను ఈసారి ఘనంగా నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఈ ప్రెస్ మీట్ కు వస్తున్న టైమ్ లో ప్రభాస్ గారు కాల్ చేసి 35 లక్షల రూపాయలు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కు విరాళంగా ఇమ్మని చెప్పారు. ఆయనకు మనందరి తరుపున కృతజ్ఞతలు చెబుతున్నా. మన అసోసియేషన్ ఇంకా బలంగా ముందుకు వెళ్తుందనే నమ్మకం కలుగుతోంది. అన్నారు.
రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ – నాకూ మీ అందరితో కలిసి ఆ వేదిక మీద కూర్చోవాలని ఉంది. నేను దర్శకుడిగా హిట్ సినిమా చేసిన తర్వాత కూర్చుంటాను. మీ అందరిలో ఎంతో ప్రతిభ ఉంది. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఆ ఘనతను మీరంతా తీసుకురావాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వెబ్ సైట్ ను విజయేంద్రప్రసాద్, హరీశ్ శంకర్ లాంఛ్ చేయగా, డైరెక్టర్స్ డే లోగోను దర్శకుడు రేలంగి నరసింహారావు ఆవిష్కరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్