మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రదర్శన
నాగార్జునసాగర్ జనవరి 16 వాయిస్ టుడే ప్రతినిధి
Display of voters’ list at the municipal office
నందికొండ మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు సంబంధించి ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్ వేణు శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,పారదర్శకమైన ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు,అలాగే వార్డుల వారీగా మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు సంబంధించి ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది జాబితాను రూపొందించామన్నారు,ఓటర్ల సౌకర్యార్థం ఫోటోలతో కూడిన గుర్తింపు వివరాలను జాబితాలో సిద్ధం చేసినట్లు వెల్లడించారు,అభ్యంతరాలు,సవరణల ప్రక్రియ ముగియడంతో పూర్తిస్థాయి జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు,ఎన్నికల సమయంలో ఓటర్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మున్సిపాలిటీ వ్యాప్తంగా 12 వార్డులకు సంబంధించి ఒక్కో వార్డుకు రెండు పోలింగ్ కేంద్రాల చొప్పున 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వివరించారు
ప్రతి ఓటర్లు తమ పేరు తుది జాబితాలో ఉందో లేదో మున్సిపల్ కార్యాలయంలో లేదా సంబంధిత వార్డు అధికారుల వద్ద సరిచూసుకోవచ్చు.ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మహేష్,బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.


