- Advertisement -
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణి
Distribution of blankets under the auspices of the Indian Red Cross Society
కమాన్ పూర్
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా వీర్లపల్లి లోని ఈశ్వరకృప వృద్ధుల ఆశ్రమంలోని 25 మంది వృద్దులకు దుప్పట్లు పంపిణి చేయనైనది. ఇండియాన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ చైర్మన్ కావేటి రాజగోపాల్ మాట్లాడుతూ చలికాలంలో ఆశ్రమం లోని వృద్దులు ఎదుర్కొంటున్న సమస్యలు సొసైటీ దృష్టికి రాగ వెంటనే 25 దుప్పట్లు పంపిణి చేసినట్లు తెలిపారు. ఈశ్వరకృప వృద్ధుల ఆశ్రమ అధ్యక్షులు PT స్వామి అధ్యక్షతన నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం లో వృద్ధుల పట్ల నిర్వాహకులు తీసుకుంటున్న జాగ్రత్తలు, అందిస్తున్న ఆహారం, పరిశుభ్రత మొదలగు విషయాలు చాలా బాగున్నాయని అన్నారు. తన వంతుగా ఆశ్రమం నిర్వహణ కొరకు గాను 15,000/- రూపాయలు విరాళం అందించనున్నట్లు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ సాదుల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ వృద్ధుల నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 25 మంది వృద్ధులను కంటికి రెప్పలా కాపాడుతున్న నిర్వాహకుల కృషిని అభినందిస్తూ 15,000/- రూపాయలు విరాళం ప్రకటించారు. ఆశ్రమ అధ్యక్షులు పిటి స్వామి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెంట్స్ పంపిణి చేయడమే కాకుండా ఆశ్రమ నిర్వహణ కొరకు ఆర్థిక సహకారం అందుస్తున్న రెడ్ క్రాస్ చైర్మన్ కావేటి రాజగోపాల్ (15,000), సాదుల వెంకటేశ్వర్లు (15,000), డివిసి మూర్తి (10,0000, మీసాల సత్యనారాయణ (5000) కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం రెడ్ క్రాస్ చైర్మన్ కావేటి రాజగోపాల్, ఆశ్రమ అధ్యక్షులు పిటి స్వామి, రెడ్ క్రాస్ సెక్రటరీ సాదుల వెంకటేశ్వర్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు గూళ్ళ అంజన్ కుమార్, డి వే సి మూర్తి, మీసాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -